Tejaswi Madivada : బిగ్ బాస్ తెలుగు సీజన్లో సందడి చేసిన భామ తేజస్వి.. ఆ షోలో తన అందచందాలతో పాటు అల్లరితో కుర్రకారులో యమ క్రేజ్ తెచ్చుకుంది. అంతేకాదు ఈ భామ కేరింత, ఐస్ క్రీమ్, జత కలిసే సినిమాల్లో నటించి తన అందాలతో అదరగొట్టింది. ప్రస్తుతం వెబ్ సిరీస్‌లలో నటిస్తోన్న ఈ భామ వీలున్నప్పుడల్లా హాట్ ఫోటో షూట్లు చేస్తూ కేక పెట్టిస్తోంది. Photo : Instagram
సినిమాలతో కంటే బిగ్ బాస్ షో వల్ల మరింతగా పాపులర్ అయ్యింది ఈ తెలుగు అందం. ప్రస్తుతం ఈ భామ కమిట్మెంట్ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ప్రమోషన్లో భాగంగా తేజస్వి కొన్ని సంచలన విషయాలను పంచుకుంది. ఇండస్ట్రీలో తనకు ఎదురైన ఓ చేదు అనుభవం గురించి మాట్లాడుతూ.. ఓ సారి సుమారు 30 మంది తాగొచ్చి తనను ఎటాక్ చేశారని.. ఆ సమయంలో ఎంతో బాధపడ్డానని తెలిపింది తేజస్వి. Photo : Instagram
ఆమె మాట్లాడుతూ.. ఓ ఈవెంట్‌కు వెళ్లినప్పుడు సుమారు 30 మంది ఫుల్‌గా తాగొచ్చి.. రాత్రి నాపై అటాక్ చేశారు. ఆ రోజు నేను ఏదో విధంగా తప్పించుకుని ఇంటికి తిరిగి చేరుకున్నాను. ఇక ఆ తర్వాత భయంతో రాత్రంతా ఏడ్చాను. ఆ సంఘటనను జీవితాంతం మర్చిపోలేను.. అంటూ తనకు జరిగిన ఆ చేదు అనుభవం గురించి తెలిపారు. Photo : Instagram
ఆమె ఇంకా మాట్లాడుతూ.. సినిమా ఇండస్ట్రీలో చాలా మంది కమిట్మెంట్ అడిగారు. కొందరు ఫోన్ చేసి అడిగితే.. మరి కొందరు మాత్రం డైరెక్ట్‌గా చూపులతోనే ఆ భావాన్ని తెలిపేవారని.. అది ఈజీగా అర్థం అవుతుందని అన్నారు.. అయితే సినీ ఇండస్ట్రీనే కాదు.. ప్రతి రంగంలోనూ క్యాస్టింగ్ కౌచ్ లాంటిది ఉంటుందనన్నారు. Photo : Instagram
లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాలో అతిథి పాత్రలో నటించిన తేజస్వి తమిళ భాషలో కూడా నటించింది. ఇక ఎన్నో సినిమాలలో అవకాశాలు అందుకుని పలు పాత్రలలో మెప్పించింది. ఆ తర్వాత తెలుగు బిగ్ బాస్ సీజన్ లో కంటెస్టెంట్ గా పాల్గొని హౌస్ లో ఉన్నంత కాలం బాగా రచ్చ రచ్చ చేసింది. అంతేకాకుండా గ్లామర్ విషయంలో కూడా బాగా డోస్ పెంచుకుంది. Photo : Instagram
Tejaswi Madivada: తెలుగు సినీ నటి, బిగ్ బాస్ బ్యూటీ తేజస్వి మదివాడ పరిచయం గురించి అందరికీ తెలిసిందే. సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాతో తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది తేజస్వి. ఆ తర్వాత రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఐస్ క్రీమ్ సినిమాలో హీరోయిన్ గా నటించింది. ఇక సోషల్ మీడియాలో బాగా యాక్టివ్ గా ఉంటుంది ఈ ముద్దుగుమ్మ. Photo : Instagram