తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో తమన్నా ఆస్తి ఎన్ని కోట్లు సంపాదించి ఉంటుందో అని చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు. Photo : Twitter
ఇక ఆమె కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ - రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట. వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఈ వజ్రాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల బహుమతిగా ఇచ్చారని అంటున్నారు. Photo : Twitter
ఇక తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికి వరుసగా సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కేక పెట్టిస్తున్నారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాళ్లు తగ్గిందని అనిపిస్తే స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నాను సంప్రదించేవారున్నారు. అలాంటిది ఆమె హీరోయిన్గా వచ్కచిన ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ కోసం వేరే భామను దింపితే తమన్నా ఫీల్ అయ్యారట. అందుకే ప్రమోషన్స్‌లో పెద్దగా పాల్గోనలేదట.. దీనికి సంబంధించి అప్పట్లో సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే.. Photo : Instagram
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో(Venkatesh) వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. Photo : Instagram
వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలైంది. . ఇక చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు.. భోళా శంకర్ తమిళ వేదాళంకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా చేస్తోంది. Photo : Instagram
తమన్నా 2005లో 15 సంవత్సరాల వయస్సులో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో నటించింది. ఇక అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మొదటి విజయాన్ని అందించింది. ఇక 2011లో 100% లవ్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ , ఎందుకంటే... ప్రేమంట! , రెబల్ , కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో అదరగొట్టింది. Photo : Instagram