మాళవిక శర్మ.. టాలీవుడ్ లో మాస్ మహారాజా రవితేజ నటించిన నేల టికెట్ సినిమాతో ఎంట్రీ ఇచ్చింది. హాట్ అండ్ బ్యూటిఫుల్ గా ఉన్న మాళవిక శర్మ అందరినీ ఆకట్టుకుంది. డాన్స్ ..పర్ఫార్మెన్స్ .. అందం.. అన్నిటిలోను మంచి మార్కులే పడ్డాయి. అయితే డెబ్యూ సినిమా నేలటికెట్ డిజాస్టర్ కావడం మాళవిక శర్మ కి పెద్ద మైనస్ గా మారింది. Photo : Instagram
నేల టికెట్ సినిమా షూటింగ్ దశలో ఉండగానే పలువురు టాలీవుడ్ మేకర్స్ డేట్స్ బుక్ చేసుకోవాలని భావించారు. అయితే సినిమా రిలీజ్ తర్వాత మాళవిక శర్మ ని తలుచుకున్న వాళ్ళు లేరు. ఇక ఆ తర్వాత ఆ మధ్య ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని హీరోగా వచ్చిన మాస్ ఎంటర్టైనర్ రెడ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద యావరేజ్ హిట్ గానే నిలిచింది. Photo : Instagram
మాళవిక శర్మ కి రెడ్ సినిమా సక్సస్ ఏమంత కలిసి రాలేదనే చెప్పాలి. ప్రస్తుతం ఈ హాట్ బ్యూటీకి తెలుగులో అవకాశాలేవీ లేవన్న మాట వినిపిస్తోంది. ఈ క్రమంలో మాళవిక శర్మ ఇక టాలీవుడ్ లో కనుమరుగవడం ఖాయం అని సినిమా వర్గాలు చెప్పుకుంటున్నాయి. మరి లక్ కలిసి వచ్చి ఒక్క సినిమాలో ఛాన్స్ వచ్చి బ్లాక్ బస్టర్ అందుకుంటే మళ్ళీ ఏదైనా స్టార్ తిరగొచ్చు. Photo : Instagram
మాళవిక ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. తన న్యాయవాద వృత్తిని కొనసాగిస్తోంది. ఆమె రిజ్వీ లా కాలేజీ నుండి క్రిమినాలజీలో స్పెషలైజేషన్‌తో బ్యాచిలర్ ఆఫ్ లాస్ డిగ్రీతో పట్టభద్రురాలైంది. తెలుగులో మాళవిక నేల టిక్కెట్టు, రెడ్ సినిమాల తర్వాత ప్రస్తుతానికి ఎటువంటీ సినిమాలు చేయడం లేదు. అయితే తమిళ్లో మాత్రం కాఫీ విత్ కాదల్ అనే సినిమా చేస్తోందని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్‌ను జరుపుకుంటోంది. చూడాలి మరి ఈ భామ అదృష్టం అక్కడ ఎలా ఉందో.. Photo : Instagram