టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తన అభిమానులకు ఇటీవలే షాకింగ్ వార్త చెప్పింది. తనకు ఉన్న ప్రాణాంతాతకమైన వ్యాధికి సంబంధించిన వివరాల్ని సోషల్ మీడియాలో పోస్టుచేసింది. ఈ పోస్టు చూసి ఆమె అభిమానులు అంతా షాక్ అయ్యారు మరికొందరు ఆందోళన వ్యక్తం చేశారు, సమంత తనకు ప్రాణాంతకమైన Myositis అనే వ్యాధి ఉన్నట్లు పేర్కొంది.
కొందరు వైద్యులు చెబుతున్న సమాచారం మేరకు సమంతకు సోకిన ఈ వ్యాధి ప్రధాన లక్షణం ఆటో ఇమ్మ్యూనిటి డిజాస్టర్ అని తెలుస్తోంది. అయితే మయోసిటిస్ వ్యాధిలో చాలా రకాలు ఉన్నాయట. పాలిమయోసిటిస్, డెర్మటో మయోసిటిస్, ఇంక్లూజన్ బాడీ మయోసిటిస్ ఇలా పలు రకాలుగా ఈ వ్యాధి సోకుతుందని, దీని లక్షణాలు తీవ్రంగా ఉంటాయని తెలుస్తోంది.