కాజల్ అగర్వాల్.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కెరీర్ మొదలై 12 ఏళ్లైనా కూడా ఇప్పటికీ అదే జోరు చూపిస్తుంది ఈ అందాల చందమామ. ఇప్పటికీ వరస సినిమాలతో రప్ఫాడిస్తూనే ఉంది. ముఖ్యంగా అమ్మడు ఫుల్ గ్లామర్ పోజులతో తన సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు ఫోటోలను పోస్ట్ చేస్తూ ఉంటుంది. దీంతో వానవిల్లులా ఉన్న చందమామను చూసి కుర్రాళ్ల మతులు చెడిపోతున్నాయి. సింపుల్గా చూపులతోనే చంపేస్తుంది ఈ ముద్దుగుమ్మ. చిన్న హీరోలతో పాటు పెద్ద సినిమాలతోనూ బిజీగా ఉంది కాజల్ అగర్వాల్.