రామ్ గోపాల్ వర్మతో డాన్స్ చేసినందుకు ఓ నటిని సొంత కుటుంబం ద్వేషిస్తోందట. వివరాల్లోకి వెళితే.. వర్థమాన నటి ఇనయ సుల్తానా రామ్ గోపాల్ వర్మతో డాన్స్ చేసిన ఓ వీడియో ఆ మధ్య సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది. ఆ ఒక్క వీడియోతో ఆమెకు ఒక్కసారిగా రావాల్సినంత పబ్లిసిటీ వచ్చింది. అయితే ఇనయ సుల్తానా మాట్లాడుతూ.. ఆ వీడియోలో వర్మతో డాన్స్ చేయడం వల్ల తన ఫ్యామిలీలో గొడవలు మొదలయ్యాయి అంటూ తాజాగా చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. Photo : Twitter
కరోనా టైంలో మా నాన్నగారు మరణించడంతో ఆర్థికంగా ఇబ్బందులకు గురయ్యానని తెలిపారు. అయితే ఆ సమయంలో తాను ఉద్యోగం చేస్తానంటే ఇంట్లో వాళ్ల ఒప్పుకోలేదని.. ఆ సమయంలోనే సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తుండగా రామ్ గోపాల్ వర్మతో పరిచయం ఏర్పడిందని తెలిపారు యువ నటి. అందులో భాగంగా ఇనయ.. తన పుట్టినరోజు నాడు వర్మను ఆ పార్టీకి పిలిచారట. Photo : Twitter
ఆ సమయంలోనే వర్మతో కలిసి డాన్స్ చేశాను. అయితే ఆ తర్వాత ఓ 4 రోజులకు ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యిందని.. ఆ వీడియోను చూసిన మా అమ్మ ఫోన్ చేసి బాగా ఏడ్చారు. పరువు మొత్తం తీశావ్.. అంటూ బంధువులు అందరూ తిడుతూ.. ద్వేషించే వారని తెలిపారు ఇనయా. ఇక ఈ భామ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఇనయా నటరత్నాలు అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఓ వెబ్ సిరీస్‌లోను నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక రామ్ గోపాల్ వర్మ విషయానికి వస్తే..
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వరుసగా సినిమాలను తీస్తూనే ఉంటారు. అందులో భాగంగా ఆయన కొండా అంటూ ఓ సినిమాను తీసిన సంగతి తెలిసిందే. ఆ సినిమా ఇటీవల విడుదలై పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. ఇక ఆ సినిమా తర్వాత ఆయన నుంచి వచ్చిన మరో చిత్రం, లడ్కీ: డ్రాగన్ గర్ల్. ఈ సినిమా జూలై 15, 2022న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో వచ్చిన ఈ సినిమాలో పూజా భలేకర్ ప్రధాన పాత్రలో నటించారు. Photo : Twitter
ఇక ఈచిత్రం ఇటు ఇండియాతోపాటు అటు చైనాలో కూడా విడుదలై ఓకే అనిపించుకుంది. కాగా చైనాలో ఈసినిమా 40,000 స్క్రీన్లలో విడుదలై అయ్యిందని తెలిపారు వర్మ. అంతేకాదు ఈ రేంజ్లో అక్కడ విడుదలైన తొలి భారతీయ చిత్రం లడ్కీ అని అంటున్నారు. ఆర్ట్సీ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ నిర్మిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో థియేటర్లలో విడుదలైంది. Photo : Twitter
ఇక అది అలా ఉంటే నిత్యం ఏదో ఒక కాంట్రవర్సీతో ట్రెండింగ్‌లో ఉండే రామ్ గోపాల్ వర్మ ఇటీవల మరోసారి వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెలిసిందే. వర్మ, రాష్ట్రపతి అభ్యర్థి ద్రౌపది ముర్మును ఉద్దేశించి చేసిన ఓ ట్వీట్‌పై బీజేపీ నాయకులు ఫైర్ అయ్యారు. అంతేకాదు అబిడ్స్ పోలీస్ స్టేషన్లో వర్మపై ఫిర్యాదు చేశారు. ఓ మహిళ పట్ల అనుచిత కామెంట్లు చేసిన వర్మపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. Photo : Twitter