ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది. తాజాగా ఈమె శీర్షాసనం వేసిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. (Image Credit : Instagram)
ప్రస్తుతం తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటు `ఒట్టు` అనే తమిళం, మలయాళం బైలింగ్వల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈషా సౌత్ కెరీర్ని డిసైడ్ చేయబోతున్నాయని చెప్పొచ్చు. (Image Credit : Instagram)