తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బ అందంలో కానీ, నటనలోని ఓ స్టార్ హీరోయిన్‌కు తీసుపోదు. అయితే ఎందుకో ఆమెకు ఇంకా అదృష్టం కలిసిరాలేదు. బహుశా ఆమె తెలుగు అమ్మాయి కావడం ప్రధాన కారణం అయ్యి ఉండోచ్చు.. అదే ఏ ముంబై, లేదా చెన్నై అయితే అవకాశాలు వరుస కట్టేవి అంటున్నారు ఆమె ఫ్యాన్స్. ఇక సినిమాల్లో తనకు వచ్చిన ప్రతి అవకాశాన్ని వదలకుండా.. నటిస్తూ మెప్పిస్తున్నారు. Photo : Twitter
అది అలా ఉంటే ఆమె త్వరలో పెళ్లి చేసుకుంటున్నారని తాజా టాక్.. అయితే ఇక్కడ విషయం ఏమంటే.. ఈ భామ ఓ డైరెక్టర్‌ను పెళ్లిచేసుకోబోతున్నట్లు, అదీ కూడా ఓ తమిళ దర్శకుడని తెలుస్తోంది. త్వరలో దీనికి సంబంధించి అధికారిక ప్రటకన కూడా రానుందట. దీనికి సంబంధించి ఓ రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Photo : Twitter
తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా గురించి ప్రత్యేకించి పరిచయం చేయాల్సిన పనిలేదు.. వరంగల్‌లో జన్మించిన ఈషా.. హైదరాబాద్‌లో పెరిగారు. అంతేకాదు MBA చేసిన ఈషా రెబ్బా.. కాలేజీ సమయంలోనే మోడల్‌గా ఎంట్రీ ఇచ్చారు.. ఇక 2012లో లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో తెరంగేట్రం చేశారు. ఈ సినిమా తర్వాత ఆమె మోహన కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో వచ్చిన అంతకు ముందు ఆ తర్వాత సినిమాతో మరింత పాపులర్ అయ్యారు. Photo : Twitter
ఇక ప్రశాంత్ వర్శ చిత్రం ఆ తో మరింత పాపులర్ అయ్యారు. ఈ సినిమాలో లెస్బియన్ పాత్రలో నటించి మెప్పించారు. ఇక ఆ తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన ఎన్టీఆర్ అరవింద సమేత వీర రాఘవ సినిమాలో నటించి వావ్ అనిపించారు. ఇక ప్రస్తుతం ఓ తమిళ చిత్రంతో పాటు ఓ మలయాళీ చిత్రంలో నటిస్తున్నారు.. ఈషా రెబ్బా.. Photo : Twitter
ఈషా వెండితెరకు పరిచయమై దాదాపు 10 ఏళ్ళు కావస్తుంది. మంచి ఆరంభం లభించినా స్టార్ కావడానికి అవసరమైన బ్రేక్ రాలేదు.సాధారణంగా టాలీవుడ్ సినీ పరిశ్రమలో తెలుగు హీరోయిన్స్ చాలా అరుదు. లోకల్ అని మన హీరోలు ఈమెను లైట్ తీసుకున్నట్టు కనబడుతోంది. తాజాగా ఈమె శీర్షాసనం వేసిన ఫోటోను అభిమానులతో పంచుకుంది. (Image Credit : Instagram)
ప్రస్తుతం తమిళంలో `అయిరామ్ జెన్మంగల్` చిత్రంలో హీరోయిన్గా నటిస్తుంది. దీంతోపాటు `ఒట్టు` అనే తమిళం, మలయాళం బైలింగ్వల్ చేస్తుంది. ప్రస్తుతం ఈ రెండు చిత్రాలు శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్నాయి. ఈ సినిమాల ఫలితాలు ఈషా సౌత్ కెరీర్‌ని డిసైడ్ చేయబోతున్నాయని చెప్పొచ్చు. (Image Credit : Instagram)