1. ప్రభాస్: ఒక్కో సినిమాకు రూ. 100 కోట్లకు పైగానే పారితోషికం అందుకుంటున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్. తాజాగా 25వ సినిమా స్పిరిట్ కోసం రూ. 150 కోట్ల వరకు అందుకుంటున్నారని ఇటీవల ఓ వార్త హల్ చల్ చేసిన సంగతి తెలిసిందే. ప్రభాస్ ప్రస్తుతం ఆదిపురుష్‌తో పాటు ప్రాజెక్ట్ కే, స్పిరిట్, సలార్‌లతో పాటు రాజా డీలక్స్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు. Photo : Twitter
4. జూనియర్ ఎన్టీఆర్: ట్రిపుల్ ఆర్ కోసం జూనియర్ ఎన్టీఆర్‌కు రూ. 45 కోట్లకు పైగానే పారితోషికం ఇచ్చినట్లు తెలుస్తుంది. మూడేళ్లు డేట్స్ ఇచ్చారు కాబట్టి అంత తీసుకున్నారని టాక్.. కొరటాల కోసం రూ. 60 కోట్ల వరకు ఛార్జ్ చేస్తున్నారట తారక్. ఈ సినిమా కూడా ప్యాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కుతుంది. Photo : Twitter
5. రామ్ చరణ్: ఈయన కూడా రూ. 45 కోట్ల పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది.. శంకర్ సినిమా కోసం రూ. 60 కోట్ల వరకు అందుకుంటున్నాడని సమాచారం.. ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోంది. రీసెంట్గా న్యూజిలాండ్ షెడ్యూల్ కూడా కంప్లీటైంది. ఈ సినిమా తర్వాత రామ్ చరణ్ .. బుచ్చిబాబు సన దర్శకత్వంలో చేయనున్నారు. Photo : Twitter
8. బాలకృష్ణ: అఖండ కోసం బాలయ్య రూ. 11 కోట్లు తీసుకున్నట్లు తెలుస్తుంది.. ఈ సినిమా రూ. 90 కోట్లు షేర్ వసూలు చేసిన నేపథ్యంలో రూ. 15 వరకు పారితోషికం పెంచినట్లు తెలుస్తుంది. బాలయ్య ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ‘వీరసింహారెడ్డి’ అనే మాస్ యాక్షన్ సినిమా చేస్తున్నారు. ఈ సినిమాను జనవరి 12న విడుదల కానుంది. Photo : Twitter
13. రవితేజ: క్రాక్ తర్వాత రవితేజ రెమ్యునరేషన్ పెరిగింది.. ఖిలాడీ, రామారావు ఆన్ డ్యూటీ కోసం రూ. 13 కోట్లు ఛార్జ్ చేసినట్లు టాక్.. రాబోయే ధమాకా, టైగర్ నాగేశ్వరరావు సినిమాల కోసం రూ. 15 కోట్లకు పైగానే అందుకుంటున్నట్లు తెలుస్తుంది అటు వాల్తేరు వీరయ్య కోసం మూడు రోజులు షూటింగ్ కోసం రూ. 10 కోట్లు తీసుకున్నట్టు సమాచారం.. Photo : Twitter
16. నితిన్: ఈ మధ్య వరస ఫ్లాపులతో బాగా డీలా పడిపోయాడు నితిన్. భీష్మ లాంటి సూపర్ హిట్ తర్వాత నితిన్ నటించిన చెక్, రంగ్ దే సినిమాలు ఫ్లాప్ అయ్యాయి. ఓటిటిలో విడుదలైన మాస్ట్రో పర్లేదనిపించింది. అటు మాచర్ల నియోజకవర్గం సినిమా డిజాస్టర్ అయింది. ప్రస్తుతం నితిన్ చేతిలో మరో రెండు మూడు సినిమాలు చేస్తున్నారు. ఇందులో ఒక్కో సినిమాకు రూ. 4 కోట్ల వరకు తీసుకుంటున్నారట నితిన్. Photo : Twitter
17. నాగ చైతన్య: ఈ మధ్య చైతూ వరస విజయాలు అందుకుంటున్నాడు. దాంతో రెమ్యునరేషన్ కూడా పెరిగింది. లవ్ స్టోరీ కరోనా కాలంలోనూ రూ. 36 కోట్లు వసూలు చేసింది. మొన్న బంగార్రాజు కూడా బాగానే ఆడింది. ప్రస్తుతం చేస్తున్న సినిమాలకు రూ. 6 కోట్లకు పైగానే అందుకుంటున్నారట చైతూ. కానీ రీసెంట్గా ఈయన నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమాతో భారీ డిజాస్టర్‌ను అందుకున్నాడు. Photo : Twitter
19. రామ్ పోతినేని: ఇస్మార్ట్ శంకర్, రెడ్ లాంటి సినిమాలతో ఫామ్‌లోకి వచ్చిన రామ్.. కానీ ఆ తర్వాత వచ్చిన ‘ది వారియర్’ కోసం రూ. 8 కోట్ల వరకు పారితోషికం అందుకుంటున్నట్లు తెలుస్తుంది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర సరైన ఫలితం అందుకోలేదు. ఇక బోయపాటితో కమిటైన పాన్ ఇండియన్ సినిమాకు రూ. 10 కోట్ల వరకు అందుకోబోతున్నాడు రామ్. Photo : Twitter