బాలయ్య ఓ వైపు సినిమాల్లో అదరగొడుతూనే టాక్ షోలోను కేక పెట్టిస్తున్నారు. అందులో భాగంగా ఆయన ఆహా ఓటీటీ కోసం అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే అంటూ ఓ టాక్ షోను చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ షో మొదటి సీజన్ మంచి విజయాన్ని అందుకుంది. ఈ రెండో సీజన్ అక్టోబర్ 14 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. మొదటి ఎపిసోడ్‌కు చంద్రబాబు, లోకేష్ వచ్చి అదరగొట్టారు. రెండో ఎపిసోడ్‌కు సిద్ధూ జొన్నలగడ్డ, విశ్వక్ సేన్ వచ్చారు. ఇక మూడో ఎపిసోడ్‌కు శర్వానంద్, అడివిశేష్ వచ్చి అలరించారు. Photo : Twitter
నాల్గవ ఎపిసోడ్‌కు మాజీ ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డితో పాటు రాజ్యసభ ఎంపీ KR సురేష్ రెడ్డి వచ్చారు. ఐదో ఎపిసోడ్‌కు అల్లు అరవింద్, కోదండ రామిరెడ్డి, రాఘవేంద్రరావులు వచ్చారు. ఇక ఆరో ఎపిసోడ్‌కు ప్రభాస్, గోపీచంద్ వస్తున్నారు. ఈ బాలయ్య, ప్రభాస్‌ల ఎపిసోడ్ రెండు పార్ట్‌లుగా స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే మొదటి పార్ట్ డిసెంబర్ 29 రాత్రి 9 గంటలకు స్ట్రీమింగ్కు వచ్చింది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఒక్కసారిగా అందరూ స్ట్రీమ్ చేయడంతో వచ్చిన అరగంటలోపే సర్వర్ క్రాష్ అయ్యింది. దీంతో ఆహా యాప్ కొన్ని గంటల వరకు పనిచేయలేదు. Photo : Twitter
ఇక ఈ మొదటి భాగంలో అన్నిటికంటే హైలెట్‌గా నిలిచింది మాత్రం చరణ్, ప్రభాస్‌ల మధ్య ఫోన్ సంభాషణ. రామ్ చరణ్, ప్రభాస్‌ను ఆటపట్టిస్తూ.. త్వరలో పెళ్లి విషయంలో డార్లింగ్ గుడ్ న్యూస్ చెబుతాడని చెప్పడం. దానికి బదులుగా ప్రభాస్ ఒరేయ్ ఒరేయ్, ఏది అన్న ఉంటే మొత్తం చెప్పరా.. జనం సోషల్ మీడియాలో ఆడేసుకుంటారంటూ అంటూ ఆపాయ్యంగా మాట్లాడడం.. ఎంతో ఆహ్లాదకరంగా అనిపించాయని అంటున్నారు నెటిజన్స్.. Photo : Twitter
రెండో భాగంగా జనవరి 6న స్ట్రీమింగ్ కానుంది. ఇక అది అలా అంటే ఈ షోకు తెలంగాణ మినిష్టర్ కేటీఆర్, రామ్ చరణ్ కలిసి వస్తున్నారని తెలుస్తోంది. ప్రస్తుతం రామ్ చరణ్ అమెరికాలో ఉన్నారు. ఆయన అక్కడించి రాగానే.. కేటీఆర్, రామ్ చరణ్ ఈషోలో పాల్గోనబోతున్నట్లు తెలుస్తోంది. ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన విడుదలకానుంది. చూడాలి మరి ఈ ఎపిసోడ్ ఎలా ఉండనుందో.. Photo : Twitter
ప్రభాస్ బాహుబలి ఎపిసోడ్ తర్వాత పవన్, త్రివిక్రమ్‌తో పాటు ప్రసారం కానుంది. ఇప్పటికే దీనికి సంబంధించిన షూట్ పూర్తి అయ్యిన సంగతి తెలిసిందే. ఈ ఎపిసోడ్లో పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్‌తో పాటు మరో దర్శకుడు క్రిష్ కూడా పాల్గోన్నారని తెలుస్తోంది. ఇక పవన్ , బాలయ్యల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగిందని.. పవన్ పర్సనల్ విషయాలపై కూడా బాలయ్య ప్రశ్నలు సంధించినట్లు తెలుస్తోంది. దీంతో ఈ ఎపిసోడ్ మరింత ఇంట్రెస్టింగ్ ఉండనుందని అంటున్నారు నెటిజన్స్. Photo : Twitter
ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే.. అఖండ సినిమా తర్వాత బాలయ్య వరుసగా సినిమాలను చేస్తున్నారు. అందులో భాగంగా ఇప్పటికే గోపీచంద్ మలినేనితో ఓ సినిమాను చేస్తున్నారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదలకానుంది. జనవరి 12, 2023 న ఈ చిత్రం గ్రాండ్‌గా విడుదలవుతోంది. శృతి హాసన్ హీరోయిన్గా చేస్తోంది. Photo : Twitter
ఇక ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ప్రచార చిత్రాలు మంచి ఆదరణ పొందాయి. ఈ సినిమా రన్ టైమ్ లాక్ అయ్యిందని తెలుస్తోంది. ఈ సినిమా రన్‌టైమ్ రెండు గంటల నలభై మూడు నిమిషాలకు లాక్ అయిందని అంటున్నారు. ఇక ఈ సినిమా నుంచి ప్రమోషన్లో భాగంగా ఇప్పటికే జై బాలయ్య అంటూ ఓ పాట విడుదలవ్వగా ఇక లేటెస్ట్గా రెండో సింగిల్ సుగుణ సుందరి లిరికల్ సింగిల్ విడుదలై మంచి రెస్పాన్స్‌ను దక్కించుకుంది. ఈ పాటను బాలయ్య, శృతిహాసన్‌లపై రొమాంటిక్‌గా చిత్రీకరించారు. Photo : Twitter
వీర సింహా రెడ్డి సినిమా తర్వాత బాలయ్య 108వ సినిమాను బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడితో చేయనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ పనులన్ని పూర్తి అయ్యాయి. దీంతో ఈ సినిమాకు సంబంధించిన పూజా కార్యక్రమాలు జరిగాయి. అతి త్వరలో షూటింగ్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్లో ఓ యాక్షన్ ఎపిసోడ్‌ను షూట్ చేయనున్నారని తెలుస్తోంది.ఈ సినిమాను షైన్ స్క్రీన్స్ బ్యానర్ మీద హరీష్ పెద్ది, సాహు గారపాటి నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ప్రీ ప్రోడక్షన్ వర్క్ జరుగుతోంది. ఈ సినిమాలో బాలయ్య బాబు మునుపెన్నడు చూడని అవతార్‌లో కనిపించనున్నాడట. ఈ సినిమాలో యువ హీరోయిన్ ‘పెళ్లిసందD’ భామ శ్రీలీల డాటర్‌గా కనిపించనుంది. Photo : Twitter
ఇక ఈ సినిమా కథ గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దాని ప్రకారం ముప్పై ఐదేళ్ల వయసులో ఉన్న హీరో.. ఆ సమయంలో ఆవేశంలో చేసిన ఓ గొడవ కారణంగా హీరోకి 14 ఏళ్ల పాటు శిక్ష పడుతుందట. ఈ నేపథ్యంలో ఏభై ఏళ్ల తర్వాత విడుదలైన హీరో ఏం చేశాడు.. అప్పుడు హీరో ఎదుర్కోనోన్న సమస్యలు ఏంటీ వంటి అంశాలతో కథ అల్లు కున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో విలన్‌గా హిందీ యాక్టర్ అర్జున్ రామ్‌పాల్ ఈ విషయంలో త్వరలో అధికారిక ప్రకటన రానుందని తెలుస్తోంది.. Balakrishna Vishwak Sen (Photo Twitter)
ఇక మరోవైపు ఆదిత్య 369ఈ సినిమాకు ఎప్పటి నుంచో సీక్వెల్ రాబోతుందని టాక్ వినపడుతోంది. అంతేకాదు ఈ సినిమాకు స్వయంగా బాలయ్యే దర్శకత్వం వహించనున్నారని తెలిపారు. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ కూడా మొదలైందని తెలుస్తోంది. ఈ సినిమాకు“ఆదిత్య 999 మ్యాక్స్” అనే టైటిల్ ఖరారు అయ్యినట్లు తెలిపారు బాలయ్య. ఆయన ఆహాలో వస్తున్న తన టాక్ షోలో మాట్లాడుతూ ఈ విషయాన్ని వెల్లడించారు. దీంతో ఫ్యాన్స్ భారీగా అంచనాలు పెట్టుకుంటున్నారు. అసలు ఈ సినిమా ఎలా ఉండనుందో.. అంటూ తెగ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. Photo : Twitter
ఇక సినిమాల విషయానికి వస్తే.. బాలయ్య మరో మాస్ యాక్షన్ సినిమాను కూడా ఓకే చేసినట్లు టాక్ నడుస్తోంది. ఇటీవల మహేష్ బాబుతో సర్కారు వారి పాటను తెరకెక్కించిన పరశురామ్ పెట్లాతో ఓ సినిమాను చేస్తున్నట్లు ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. పరశురామ్ చెప్పిన కథ నచ్చడంతో ఓకే అన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించి మరింత సమాచారం తెలియాల్సి ఉంది. Photo : Twitter
మరోవైపు ఈ సినిమాలో బిగ్‌బాస్ ఓటీటీ తెలుగు విన్నర్ బిందు మాధవి కూడా ఈ సినిమాలో ఛాన్స్ ఇస్తున్నట్టు ఈ సినిమా గ్రాండ్ ఫినాలేలో అనిల్ రావిపూడి చెప్పారు. మరి బిందు మాధవికి ఈ సినిమాలో హీరోయిన్ ఛాన్స్ ఇస్తాడా ? లేకపోతే వేరే ఏదైనా పాత్ర ఇస్తాడనేది చూడాలి. మొత్తంగా ప్రేక్షకులు మరిచిపోయిన బిందు మాధవికి అనిల్ రావిపూడి.. అది కూడా బాలయ్య సినిమాలో అవకాశం అంటే మాములు విషయం కాదు. మరి ఈ సినిమాతో బిగ్‌బాస్ బ్యూటీకి మరిన్ని అవకాశాలు వస్తాయా అనేది చూడాలి. Photo : Twitter
ఈ దర్శకుడు అనిల్ రావిపూడి విషయానికి వస్తే.. జనవరి 23, 2015న పటాస్ సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయం అయ్యాడు. ఎఫ్3 హిట్ తర్వాత అనిల్.. బాలయ్యను డైరెక్ట్ చేయనున్నాడు. అపజయం ఏరుగని దర్శకుడితో బాలయ్య సినిమా ఉండడంతో ఈ సినిమాపై భారీగా అంచనాలు పెట్టుకున్నారు నందమూరి అభిమానులు. ఇక ఈ చిత్రాన్నిషైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మించనున్నారు. Photo : Twitter