తెలుగు ఇండస్ట్రీ అంటే ఒకప్పుడు ఒకటే ఉండేది.. ఇప్పుడు కూడా ఒకటే అయినా రెండు తెలుగు రాష్ట్రాలుగా విడిపోయింది. అయితే చాలా మంది అగ్ర దర్శకులు మాత్రం ఇదివరకు కేవలం ఆంధ్రప్రదేశ్ నుంచి ఎక్కువగా కనిపించే వాళ్లు. అక్కడక్కడా మాత్రమే తెలంగాణ ప్రాంతం నుంచి దర్శకులు సత్తా చూపించే వాళ్లు. అయితే ఇప్పుడు మాత్రం ఇండస్ట్రీలో రాజమౌళి, త్రివిక్రమ, కొరటాల, బోయపాటి లాంటి కొందరు దర్శకులు మినహా మిగిలిన వాళ్లంతా కూడా తెలంగాణ నుంచే ఉన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా న్యూ స్ 18 స్పెషల్.. మరి వాళ్లెవరు.. ఎక్కడ్నుంచి వచ్చారు చూద్దాం.. (File/Photos)
సందీప్ రెడ్డి వంగా: వరంగల్ (అర్జున్ రెడ్డి) : విజయ్ దేవరకొండతో తెరకెక్కించిన అర్జున్ రెడ్డి మూవీతో ఒక్కసారిగా పాపులర్ అయ్యారు. ఆ తర్వాత అదే సినిమాను బాలీవుడ్లో ‘కబీర్ సింగ్ తెరకెక్కించి సత్తా చాటాడు. ఇపుడు రణ్‌బీర్ కపూర్‌తో ‘యానిమల్’ సినిమా చేస్తున్నారు. ఆ తర్వాత ప్రభాస్‌తో ‘స్పిరిట్’ మూవీ చేయనున్నారు.
సాగర్ కే చంద్ర (నల్గొండ) | తెలంగాణలోని నల్గొండ జిల్లాకు చెందిన సాగర్ కే చంద్ర కూడా చాలా మంది దర్శకుల మాదిరే గ్రాడ్యూయేషన్ పూర్తైన తర్వాత ప్రముఖ దర్శకుడు నటుడు రవి బాబు దగ్గర మరో ఇద్దరు ముగ్గురు దర్శకులు దగ్గర పలు చిత్రాలకు అసిస్టెంట్‌గా పనిచేసారు. ఆ తర్వాత 2012లో రాజేంద్ర ప్రసాద్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ‘అయ్యారే’ చిత్రంతో దర్శకుడిగా మెగాఫోన్ పట్టుకున్నారు. ఆ తర్వాత అప్పట్లో ఒకడుండేవాడు. తాజాగా పవన్ కళ్యాణ్‌తో ‘భీమ్లా నాయక్’ మూవీతో సత్తా చాటాడు. (Twitter/Photo)
తెలంగాణ దర్శకుల విషయానికొస్తే..శ్యామ్ బెనగళ్ ఈ పేరు వినని భారతీయ సినీ ప్రేమికుడు ఉండరు. తెలంగాణ ప్రాంతానికి చెందిన ఈ దర్శకుడు బాలీవుడ్లో ఎన్నో క్లాసిక్ సినిమాలను తెరకెక్కించారు. ఈయన టాలెంట్‌కు కేంద్రం ‘పద్మశ్రీ’ బిరుదుతో గౌరవించింది. అంతేకాదు చలన చిత్ర రంగంలనే పేరు మోసిన దాదా సాహెబ్ పాల్కే అవార్డును అందుకున్న ఘనాపాఠి బెనగళ్. (Twitter/Photo)