మరీ ముఖ్యంగా తారకరత్న వైఫ్ అలేఖ్య రెడ్డి తీవ్రంగా విలపిస్తోంది. నేటికీ తన భర్త జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగం చెందుతోంది. ఆ విషాదం నుంచి ఇంకా బయటికి రాని అలేఖ్య రెడ్డి.. తన భర్త మరణించి నెల రోజులు కావడంతో ఓ ఎమోషనల్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాధాతప్త హృదయంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.
కొంతమంది నుంచి ఎదురవుతున్న ద్వేషాన్ని చూడలేక మనం కళ్ళకు గంతలు కట్టుకున్నాం. మన పెళ్లి నిర్ణయం అందరికీ దూరం చేసింది. అయినవాళ్లే పదే పదే బాధ పెట్టిన సందర్భాలు బోలెడు. కుటుంబానికి దూరం కావడం వలన పెద్ద కుటుంబం కావాలనుకున్నావు. 2019లో ఇద్దరు కవలలకు జన్మనివ్వడంతో మన కుటుంబం పెద్దది కావడంతో పాటు నీ కోరిక నెరవేరింది.
ఒకానొక సమయంలో నువ్వు మోస్తున్న బాధను ఎవరూ అర్థం చేసుకోలేదు. కనీసం పట్టించుకోలేదు కూడా. మన అనుకున్న వాళ్లే బాధించినప్పుడు ఆ గుండె బరువు మాటల్లో చెప్పలేం. అలాంటి సమయంలో నేను ఏమీ చేయలేక నిస్సహాయంగా ఉండిపోయాను. నువ్వే మా మా రియల్ హీరో ఓబు. నీతో జర్నీ చిన్నదే కావచ్చు కానీ అద్భుతమైన జర్నీ అంటూ ఎమోషనల్ నోట్ రాసింది అలేఖ్య రెడ్డి.