నారా చంద్రబాబు, నారా లోకేష్ ఇద్దరూ కూడా తారకరత్న కుటుంబానికి ఆర్థికంగా అండగా ఉంటున్నారనే విషయం బయటకొచ్చింది. తారకరత్న వైద్యానికి లక్షల్లో ఖర్చు అవుతోందని, మెరుగైన చికిత్స అందించడానికి ఇప్పటికే కోటి రూపాయలకు పైగా హాస్పిటల్ ఖర్చులు అయ్యాయని తెలుస్తోంది. అయితే ఈ ఖర్చులను స్వయంగా నారా లోకేష్ భరిస్తున్నట్లు వార్తలు షికారు చేస్తున్నాయి.