హిందూపురంలో తాను నిర్మించిన హాస్పిటల్ లో హెచ్ బ్లాక్ కి తారకరత్న పేరు పెట్టాలని ఆయన డిసైడ్ అయ్యారట. అంతేకాదు తన బిడ్డ తారకరత్న పేరు మీద కార్డియాక్ సర్జరీ, తోరియాక్ సర్జరీని పేదలకు ఉచితంగా చేసేలా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇందుకోసం కోటి 30 లక్షలు విలువ చేసే సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ ను కూడా తీసుకున్నారని తెలుస్తోంది.
విదేశాల నుంచి భారీ ఇన్స్ట్రుమెంట్స్ తీసుకొచ్చిన బాలకృష్ణ.. పేదలకు ఉచిత వైద్య సేవ చేయబోతున్నారట. దేంతో పాటు చిన్న పిల్లలకు ఉచిత భోజనంతో పాటు కావాల్సిన మందులు కూడా మూడు నెలల పాటు ఫ్రీగా ఇవ్వబోతున్నారని తెలుస్తోంది. తాను ఎమ్మెల్యేగా వ్యవహరిస్తున్న హిందూపురం ప్రజలతో పాటు రెండు రాష్ట్రాల ప్రజలు ఈ సేవలు ఉపయోగించుకునేలా ఆయన ప్లాన్ చేశారట.
తారకరత్న మరణంతో ఆయన వైఫ్ అలేఖ్య రెడ్డి తీవ్రంగా విలపిస్తోంది. నేటికీ తన భర్త జ్ఞాపకాలతో తీవ్ర భావోద్వేగం చెందుతోంది. ఆ విషాదం నుంచి ఇంకా బయటికి రాని అలేఖ్య రెడ్డి.. తన భర్త మరణించి నెల రోజులు కావడంతో ఓ ఎమోషనల్ నోట్ రాసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. బాధాతప్త హృదయంతో ఆమె పెట్టిన ఈ పోస్ట్ వైరల్ అవుతోంది.