అన్న నందమూరి తారకరామారావు 12 మంది సంతానంలో 8 మంది మగపిల్లలు. అందులో 5వ కుమారుడు నందమూరి మోహనకృష్ణ. పెద్దగా వార్తల్లో ఉండరు. లో ఫ్రొఫైల్ మెయింటెన్ చేస్తూ ఉంటారు. ఈయన గురించి జనాలకు పెద్గగా తెలియదు. కానీ ఈయన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌గా అన్న ఎన్టీఆర్‌తో పాటు తమ్ముడు బాలకృష్ణ సినిమాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. ఈయన 2 సెప్టెంబర్ 1956లో అన్న హరికృష్ణ పుట్టినరోజునే ఈయన జన్మించడం విశేషం. (Twitter/Photo)
సీనియర్ ఎన్టీఆర్ పెద్ద కొడుకు రామకృష్ణ చాలా చిన్న వయసులోనే అరుదైన వ్యాధి (మసూచి) వచ్చి అనారోగ్యంతో కన్నుమూసాడు. రామకృష్ణ మరణించినపుడు ఇరుగు పొరుగు షూటింగ్లో ఉన్నారు అన్నగారు. అయినా కూడా అక్కడ షూటింగ్ పూర్తి చేసి ఇంటికి వచ్చారు. రామకృష్ణ మరణించిన విషయం జీర్ణించుకోడానికి చాలా రోజులు పట్టింది. ఆ తర్వాత పుట్టిన కొడుకు రామకృష్ణ జూనియర్ అని నామకరణం చేసారు. (File/Photo)
మొత్తంగా ఎన్టీఆర్‌కు 12 సంతానంలో 8 మంది మగ పిల్లలు.. 4 ఆడ పిల్లలు.. ఇందులో ముగ్గురు కుమారులైన రామకృష్ణ, సాయికృష్ణ, హరి కృష్ణ కన్నుమూసారు. ఇందులో రామకృష్ణ.. ఎన్టీఆర్ బతికి ఉండగానే కన్నుమూసారు. మిగతా ఇద్దరు తర్వాత స్వర్గస్తులయ్యారు. గతేడాది కంఠమనేని ఉమా మహేశ్వరి కలిపి మొత్తం నలుగురు సంతానం ఈ లోకాన్ని విడిచి వెళ్లారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సంతానంలో 5 గురు కుమారులు, 3 ముగ్గురు కుమార్తెలు మాత్రమే ఉన్నారు.
ఆ తర్వాత వెనుదిరిగి చూసుకోలేదు మోహనకృష్ణ.. ఆ తర్వాత అనురాగ దేవత, కత్తుల కొండయ్య, అల్లరి కృష్ణయ్య, దేశోద్దారకుడు, శ్రీనివాస కళ్యాణం, బ్రహ్మర్షి విశ్వామిత్ర, భార్గవ రాముడు, పట్టాభిషేకం, అశోక చక్రవర్తి, పెద్దన్నయ్య, గొప్పింటి అల్డుడు వంటి చిత్రాలకు ఛాయాగ్రాహకుడిగా పనిచేశారు. అన్నగారు చివరి రోజుల్లో నటించిన సమ్రాట్ అశోక , ‘శ్రీనాథ కవిసార్వభౌముడు వంటి చిత్రాలకు ఈయనే సినిమాటోగ్రఫీ అందించారు. ఇక నందమూరి హీరోలతో కాకుండా వెంకటేష్ హీరోగా నటించిన ‘శ్రీనివాస కళ్యాణం’ సినిమాకు ఛాయగ్రాహకుడిగా పనిచేశారు. (Twitter/Photo)
ఈయన 1980లో ప్రముఖ నిర్మాత యు.విశ్వేశ్వరరావు కూతురు శాంతిని వివాహాం చేసుకున్నారు. వీరికి నందమూరి తారకరత్న.. నందమూరి రూప. ఈమె వివాహాం 2014లో ప్రముఖ వ్యాపారవేత్తతో జరిగింది. ఈయన పలు చిత్రాలను నిర్మించారు. చివరగా కుమారుడు తారకరత్నతో వి.సముద్ర దర్శకత్వంలో తెరకెక్కిన ‘వెంకటాద్రి’ సినిమాకు నిర్మాతగా వ్యవహరించారు.