చిరంజీవి ట్వీట్ చేస్తూ.. సోదరుడు తారకరత్న త్వరగా కోలుకుంటున్నారు. ఇంక ఏ ప్రమాదం లేదు అనే మాట నాకు ఎంతో ఉపశమనం కలిగించిందన్నారు. ఇక తారకరత్న త్వరలో పూర్తి స్థాయిలో కోలుకొని ఇంటికి తిరిగి రావాలని కోరుకుంటూ, ఈ పరిస్థితి నుండి కాపాడిన ఆ డాక్టర్లకు ఆ భగవంతుడికి కృతజ్ఞతలు అంటూ ట్వీట్ చేసారు. (Twitter/Photo)
నందమూరి తారకరత్న ఈ నెల 27న టీడీపీ నాయకుడు లోకేష్ పాదయాత్రలో ఉన్నట్టుండి కుప్పకూలిపోయారు. దీంతో ఆయన్ని సమీపం కుప్పంలోని హాస్పిటల్లో చికిత్స అందించారు. ఆ తర్వాత వైద్యుల సలహాతో ప్రత్యేక అంబులెన్స్‌లో బెంగళూరులోని నారాయణ హృదయాలయ హాస్పిటల్లో తరలించారు. ఆక్కడ వైద్యులు తారకరత్నకు మెరుగైన వైద్యం అందిస్తున్నారు. ఇక హస్పిటల్లో బాబాయి బాలయ్య అన్ని దగ్గరుండి చూసుకుంటున్నారు. (ఫైల్ ఫోటో)
ఇక తారకతర్న సినీ కెరీర్ విషయానికొస్తే.. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అందులో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు.. అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటిరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ విలన్‌గా మెప్పించే ప్రయత్నం చేసాడు. మొత్తంగా 21 సినిమాల్లో నటించాడు. నటుడిగా ‘సారథి’ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్‌లో సీఐ ప్రతాప్ పాత్రలో అలరించారు. ఈ పాత్ర తారకరత్నకు మంచి పేరే తీసుకొచ్చింది. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్ధిస్తున్నారు.