అయితే ఇలా శరీరం నీలి రంగులోకి మారడం ఎప్పుడు జరుగుతుంది? దీనికి కారణాలేంటి అనే విషయాలపై పలువురు డాక్టర్స్ స్పందిస్తున్నారు. ఎక్స్పర్ట్ కార్డియాలజిస్ట్స్ చెబుతున్న వివరాల ప్రకారం.. గుండె కొట్టుకోవడం నెమ్మదించినప్పుడు శరీర భాగాలకు రక్త ప్రసరణ తగ్గిపోవడం, ఆ కారణంగా రక్తం చేరని కాలి, చేతి వేళ్ళతో పాటు కొన్ని శరీర భాగాలు నీలం రంగులోకి మారతాయని అంటున్నారు.