Taraka Ratna - Balakrishna: ప్రస్తుతం నందమూరి తారకరత్న ఆరోగ్య పరిస్థితులపై అందరిలోనూ ఆందోళన నెలకొంది. ఆయన హెల్త్ కండీషన్ సీరియస్ గా ఉందని తెలియడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఒక్కొక్కరుగా బెంగళూరు నారాయణ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. రీసెంట్గా ఈ నెల 27న ఈయన లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం ఈయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని చెబుతున్నారు. తాజాగా తారకరత్న బాబాయి.. అబ్బాయి తారకరత్న హెల్త్ కండిషన్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
మొన్న శుక్రవారం తారకరత్నకు మాసివ్ హార్ట్ ఎటాక్ రావడం సినీ, రాజకీయ వర్గాల్లో కలకలం రేపిన సంగతి తెలిసిందే కదా. ముందు ఆయన హార్ట్ బీట్ ఆగిపోయిన .. తర్వాత మళ్లీ గుండె కొట్టుకోవడం మిరాకల్ అని చెప్పారు. శరీరంలో మిగతా ఆర్గాన్స్ అన్ని బాగానే ఉన్నాయి. నిన్నటి కన్న ఈ రోజు ఈయన హెల్త్ కండిషన్ బాగుందన్నారు. Balakrishna Twitter
గుండె నాళాల్లోకి స్టంట్ వేయడానకీ ఆయనకు డాక్టర్లు కొన్ని మందులు వేస్తున్నారు. బీపీ, షుగర్ లెవల్స్ నార్మల్ అయ్యాక స్టంట్ వేయనున్నట్టు చెప్పారు. తారకరత్న హెల్త్ విషయమై వైద్యులు అన్ని రకాలుగా కేర్ తీసుకుంటున్నారని చెప్పారు. మళ్లీ గుండెపోటు వచ్చే ఛాన్సెస్ ఉన్నందున డాక్టర్లు అన్ని విధాలుగా జాగ్రత్తలు తీసుకుని వాళ్ల ట్రీట్మెంట్ కంటిన్యూ చేస్తున్న బాలకృష్ణ చెప్పారు. తారకరత్న ఆరోగ్యం కోసం ప్రార్ధిస్తున్న అభిమానులకు, శ్రేయోభిలాషులకు ఈ సందర్భంగా బాలయ్య కృతజ్ఞతలు తెలిపారు. (Balakrishna Twitter)
తారకరత్న శరీరం ట్రీట్మెంట్కు సహకరిస్తోందని, ప్రస్తుతం ఆయనకు వైద్యులు మెరుగైన వైద్యం అందిస్తున్నారని ఎన్టీఆర్ మీడియాకు చెప్పారు. . 27వ తేదీన కుప్పంలో జరిగిన సంఘటన తనను బాధించిందని చెప్పారు. తారకరత్నపై తాత గారి ఆశీర్వాదం, అభిమానుల ఆశీర్వాదం ఉందని చెప్పి అన్న తారకరత్న ఆరోగ్య పరిస్థితిపై ఒకింత కంటనీరు పెట్టుకున్నారు.(Photo Twitter)
ఇక తారకతర్న సినీ కెరీర్ విషయానికొస్తే.. హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే అన్ని సినిమాలతో రావడం అంటే చిన్న విషయం కాదు. కానీ తారకరత్న విషయంలో ఇదే జరిగింది. 2002లో ఒకటో నెంబర్ కుర్రాడు సినిమాతో వచ్చాడు తారక్. ఆ సినిమాతో పాటు మరో 8 సినిమాలను కూడా ఒకే రోజు మొదలు పెట్టారు. కేవలం 20 ఏళ్ళ వయసులోనే ఇండస్ట్రీకి వచ్చాడు తారకరత్న. వచ్చీ రావడంతోనే 9 సినిమాల హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
అందులో చాలా వరకు విడుదల కాలేదు. కొన్ని సినిమాలు పెద్ద నిర్మాణ సంస్థలు.. అగ్ర దర్శకులతో కూడా మొదలుపెట్టాడు తారకరత్న. కానీ ఎందుకో అవి తర్వాత మెటిరియలైజ్ కాలేదు. కేవలం ముహూర్తంతోనే ఆగిపోయిన సినిమాలు చాలానే ఉన్నాయి. అప్పుడు మొదలుపెట్టిన సినిమాలలోనే ఒకటో నెంబర్ కుర్రాడు, యువరత్న, తారక్, నో, భద్రాద్రి రాముడు లాంటి సినిమాలు మాత్రమే విడుదలయ్యాయి.
ఆ తర్వాత మరికొన్ని సినిమాల్లోనూ విలన్గా మెప్పించే ప్రయత్నం చేసాడు. మొత్తంగా 21 సినిమాల్లో నటించాడు. నటుడిగా ‘సారథి’ తర్వాత ఏ సినిమా చేయలేదు. ఇక క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన 9 అవర్స్ అనే వెబ్ సిరీస్లో సీఐ ప్రతాప్ పాత్రలో అలరించారు. ఈ పాత్ర తారకరత్నకు మంచి పేరే తీసుకొచ్చింది. త్వరలో రాజకీయ ఆరంగేట్రం చేయబోతున్నట్టు చెప్పాడు. వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేయబోతున్నట్టు టీడీపీ వర్గాలు పేర్కొన్నాయి.ప్రస్తుతం అనారోగ్యంతో హాస్పిటల్లో చేరిన ఈయన త్వరగా కోలుకోవాలని అభిమానులు, శ్రేయోభిలాషులు ప్రార్ధిస్తున్నారు.