Taraka Ratna - Balakrishna | గత నెల 27న నందమూరి వారసుడు తారకతర్న లోకేష్ యువగళం పాదయాత్రలో పాల్గొని గుండెపోటుతో హాస్పిటల్లో చేరారు. ప్రస్తుతం బెంగళూరులోని నారాయణ హృదలయాలలో ఆయనకు చికిత్స కొనసాగుతోంది. తారకరత్న త్వరగా కోలుకోవాలని అభిమానులు, రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా స్పందిస్తున్నారు. ఇది ఇలా ఉంటే తారకరత్న ఆరోగ్యం కోసం బాలయ్య చిత్తూరులోని మృత్యుంజయ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు. (Twitter/Photo)
ఓవైపు బెంగళూరులోని నారాయణ హృదయాలలో చికిత్స పొందుతున్న తారకరత్న ఆరోగ్య పరిస్థితులను సమీక్షిస్తూనే .. అఖండ దీపం బాధ్యతలు తన పర్సనల్ పీఏకు రవికి అప్పగించారు. జిల్లా చౌడేపల్లి మండలం బత్తలాపురం మృత్యుంజయ స్వామి ఆలయంలో అఖండ జ్యోతి వెలుగుతోంది. ఈ దీపానికి సంబంధించిన పూజలు కఠోర దీక్షతో నియమబద్ధంగా కొనసాగుతున్నాయి. (Twitter/Photo)
ఈ అఖండ దీపాన్ని నువ్వుల నూనెతో మట్టి పాత్రలో వెలిగిస్తారు. అఖండ అంటే ఖండితం లేనటు వంటింది. నువ్వుల నూనె శనీశ్వరుడికి సంకేతం. ఆయన ఆయు: కారకుడు. అందుకే మృత్యుంజయ ఆలయంలో ఈ అఖండ జ్యోతిని దాదాపు 44 రోజుల పాటు వెలగనుంది. దాంతో పాటు తారకరత్న ఆరోగ్యం కోసం మృత్యుంజయ జపాన్ని కూడా పండితులతో చేయిస్తున్నారట. ఇప్పటికే తారకరత్న చికిత్స కు స్పందిస్తున్నారు. గుండె కూడా పనిచేస్తోంది. మెదడుకు సంబంధించిన సమస్యలున్నట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందిస్తున్నారు. బ్రెయిన్లో స్వెల్లింగ్ తగ్గిన తర్వాత ట్రీట్మెంట్ మొదలుపెట్టే అవకాశాలున్నాయి. (Twitter/Photo)