విశ్వక్ సేన్ వల్ల తనకు, తన మూవీ యూనిట్‌కి చాలా అవమానం జరిగిందని చెప్పిన అర్జున్.. విశ్వక్ సేన్ కమిట్మెంట్కి కట్టుబడి ఉండడని అన్నారు. అన్నీ ఓకే చేసుకొని తీరా షూటింగ్ సమయంలో విశ్వక్ సేన్ చేసిన పనులతో ఎంతో బాధ కలిగిందని అర్జున్ తెలిపారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ వంటి హీరోల ఎంత డెడికేటెడ్‌గా ఉంటారని ఆయన అన్నారు.
అయితే ఇచ్చిన కాల్షీట్ ప్రకారం బాలకృష్ణ సెట్లో ఉండేవారు. కానీ ఈ గొడవలో అర్జున్ గారు షూటింగు మొదలుపెట్టేశారు, విష్వక్ సేన్ కొంతవరకూ చేశారన్నారు. 'నాకు నచ్చని విషయాలు కొన్ని ఉన్నాయి. వాటిని గురించి మాట్లాడుకున్నాక మొదలెడదాం' అని అన్నట్టుగా విష్వక్ చెబుతున్నాడన్నారు తమ్మారెడ్డి. Vishwak Sen next movie Photo : Twitter