బిగ్ బాస్ షో గురించి మన దగ్గర కొత్తగా పరిచయాలు అవసరం లేదు. ఎక్కడో ఫారెన్ కంట్రీస్‌లో రప్ఫాడించిన ఈ షోను హిందీ వాళ్లు తీసుకొచ్చారు. ఆ తర్వాత రీజనల్ లాంగ్వేజ్‌లలో కూడా సూపర్ హిట్ అయి కూర్చుంది బిగ్ బాస్. దాంతో అందరూ కూడా ఈ ఇంటిపై బాగానే కన్నేసారు ఇప్పుడు. మొన్నటికి మొన్న బిగ్ బాస్ 15 కూడా పూర్తయింది. తెలుగులో ఓటిటి వర్షన్ మొదలు కానుంది.
రేటింగ్స్ కూడా బాగానే వస్తుండటంతో వాళ్లను మార్చాలనే టాపిక్ కూడా ఎప్పుడూ రాలేదు. అయితే కమల్ హాసన్ బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకున్నాడు కమల్ హాసన్. దీని గురించి ఇప్పుడు అధికారిక సమాచారం వచ్చింది. దానికి కారణం ఈయన విక్రమ్ సినిమాతో బిజీగా ఉండడమే. ఇప్పుడు రాజకీయాలు లేవు.. ఆయన అంత బిజీగా ఏం లేడు.
రాజకీయాలలో చాలా సమయం కేటాయించిన కమల్ హాసన్.. అక్కడ ఒక్క సీట్ కూడా గెలవలేకపోయాడు. కనీసం తాను కూడా గెలవలేదు. దాంతో మళ్లీ సినిమాలతో బిజీ అవుతున్నారు కమల్ హాసన్. దాంతో ఇప్పుడు టైమ్ దొరకడం లేదు. అందుకే బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకుంటున్నట్లు అనౌన్స్ చేసాడు కమల్. ప్రస్తుతం ఈయన లోకేష్ కనకరాజ్ దర్శకత్వంలో విక్రమ్ సినిమా చేస్తున్నాడు.
నిజానికి పాలిటిక్స్ కారణంగాన 5వ సీజన్ నుంచే తప్పుకోవాలని చూసాడు. కానీ పరిస్థితులు అనుకూలించడంతో మళ్లీ హోస్ట్ చేసాడు కమల్. అయితే ఇప్పుడు మాత్రం బిగ్ బాస్ అల్టిమేట్ నుంచి తప్పుకున్నాడు. మేకర్స్‌తో సంప్రదింపులు జరిగిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రకటించాడు కమల్ హాసన్. బిగ్ బాస్ 6 తమిళంలో మళ్లీ కలుసుకోనున్నాడు లోకనాయకుడు.