తమిళ హీరో కార్తి సినిమాలకు తెలుగులో కూడా మంచి డిమాండ్ ఉంది. ఈయన సినిమాలు ఇక్కడ కూడా మంచి మార్కెట్ సొంతం చేసుకున్నాయి. యుగానికి ఒక్కడు నుంచి ఆవారా, నా పేరు శివ, ఖాకీ, ఖైదీ లాంటి సినిమాలతో మంచి విజయాలు అందుకున్నారు కార్తి. అయితే ఈయన తెలుగు సినిమాలకు టైటిల్స్ మాత్రం చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ముఖ్యంగా తెలుగులో వచ్చిన క్లాసిక్ టైటిల్స్ తన సినిమాల కోసం వాడుకుంటారు ఈయన. ఇప్పుడు కూడా మరోసారి సర్ధార్ అనే పాత టైటిల్‌తో పలకరించాడు.ఈ సినిమా కంటే కార్తి పాత టైటిల్స్‌తో చేసిన సినిమాలేంటో చూద్దాం..