2. Vijay - Vamsi Padipally: తమిళ సూపర్ స్టార్ విజయ్ కూడా ఇప్పుడు తెలుగులోకి వస్తున్నాడు. వరస విజయాలతో తెలుగులో విజయ్ ఫాలోయింగ్ బాగా పెరిగిపోయింది. కరోనా సమయంలో వచ్చిన మాస్టర్ తెలుగులో 12 కోట్ల షేర్ వసూలు చేసింది. ఇప్పుడు ఈయన వంశీ పైడిపల్లితో దిల్ రాజు నిర్మాణంలో ఓ పాన్ ఇండియన్ సినిమా చేస్తున్నాడు. వచ్చే యేడాది సంక్రాంతి లేదా సమ్మర్ కానుకగా విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నారు.
Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ సైతం టాలీవుడ్ దర్శకుల వైపు చూస్తున్నాడు. గత కొన్నేళ్లుగా ఈయనకు సరైన విజయం లేదు. తమిళ దర్శకులు రజినీ ఇమేజ్ సరిగ్గా బ్యాలెన్స్ చేయలేకపోతున్నారు. అందుకే ఈయన చూపు టాలీవుడ్‌పై పడింది. ఈ మధ్యే ఓ అగ్ర దర్శకుడు చెన్నై వెళ్లి రజినీకి కథ కూడా చెప్పినట్లు ప్రచారం జరుగుతుంది. నెల్సన్ దిలీప్ కుమార్ సినిమా తర్వాత ఈ కాంబో సెట్స్ పైకి వెళ్లే అవకాశాలున్నాయి.
Suriya - Boyapati Sreenu: అఖండ సినిమాతో సంచలన విజయం అందుకున్న బోయపాటి శ్రీను త్వరలోనే సూర్యతో సినిమా చేయబోతున్నాడనే వార్తలు వస్తున్నాయి. నిజానికి ఈ కాంబినేషన్‌పై చాలా ఏళ్లుగా వార్తలు వస్తున్నాయి. కానీ ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అయితే సూర్య, బోయపాటి కాంబినేషన్ మాత్రం పక్కా అనే ప్రచారం జరుగుతుంది. ఈ చిత్రాన్ని దిల్ రాజు నిర్మించే అవకాశాలున్నాయి.