Tamil Directors In Telugu: | తెలుగు దర్శకులు, తమిళంలో హిందీలో సినిమాలు డైరెక్ట్ చేసినట్టు.. ఎంతో మంది తమిళ దర్శకులు డైరెక్ట్‌గా తెలుగు తెరపై సత్తా చూపెట్టారు. ఇప్పటికే తమిళ దిగ్గజ దర్శకులు కే.బాలచందర్, మణి రత్నం, కే.యస్.రవికుమార్, సురేష్ కృష్ణ, మురగదాస్ వంటి వాళ్లు తెలుగులో దర్శకులుగా సత్తా చూపెట్టారు. ఈ లిస్టులో ఇపుడు కోలీవుడ్ దర్శకుడు శంకర్,లింగుసామి,వెంకట్ ప్రభు, హరి కూడా చేరారు. మొత్తంగా తెలుగులో సత్తా చూపెట్టిన తమిళ దర్శకులపై న్యూస్ 18 ఫోకస్.. (tamil directors)
లింగుసామి | తమిళంలో ‘పందెం కోడి’, ‘ఆవారా’ వంటి మాస్ హిట్ మూవీస్తోొ తన కంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న లింగుసామి ఇపుడు డైరెక్ట్‌గా రామ్ పోతినేని హీరోగా ఓ తెలుగు సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఇందులో కృతి శెట్టి కథానాయికగా నటిస్తోంది. విలన్‌గా ఆది పినిశెట్టి నటిస్తున్నారు.ఈ చిత్రానికి ‘వారియర్’ అనే టైటిల్ కన్ఫామ్ చేశారు. గతంలో లింగుసామి .. అల్లు అర్జున్ హీరోగా ఓ ద్విభాషా చిత్రం ప్రారంభమైంది. ఆ తర్వాత ఎందుకో ఈ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. (Twitter/Photo)
శంకర్ | శంకర్ ఇప్పటి వరకు తన తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగులో మంచి మార్కెట్ క్రియేట్ చేసుకున్నారు. ఇపుడు తొలిసారి తెలుగులో రామ్ చరణ్‌తో ప్యాన్ ఇండియా మూవీ తెరకెక్కిస్తున్నారు. దిల్ రాజు నిర్మిస్తోన్న ఈ సినిమా ఇప్పటికే రెండు షెడ్యూల్స్ కంప్లీట్ చేసుకుంది. శంకర్ మొదటిసారి దక్షిణాదిలో తెలుగులో ఓ సినిమా చేస్తున్నారు. ఈ సినిమా కోసం శంకర్, రామ్ చరణ్ కన్న ఎక్కువ పారితోషకం తీసుకోబోతున్నట్టు కోలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. ఈ సినిమా పొలిటికల్ నేపథ్యంలో ఒకే ఒక్కడు సినిమాకు సీక్వెల్‌గా తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. దిల్ రాజు ఈ సినిమాను ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎక్కువగా తెలుగు నటులే ఈ సినిమాలో నటిస్తున్నారు. : Twitter
సిరుతై శివ | తమిళంలో రజినీకాంత్‌తో ‘అన్నాత్తే’ అజిత్‌తో ‘వివేకం, విశ్వాసం,వీరమ్ వంటి పలు చిత్రాలను తెరకెక్కించిన శివ తెలుగులో కూడా శంఖం, శౌర్యం, దరువు వంటి చిత్రాలను తెరకెక్కించారు. ముందుగా సినిమాటోగ్రాఫర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈయన ఆ తర్వాత తెలుగు సినిమా గోపీచంద్ హీరోగా నటించిన ‘శౌర్యం’ మూవీతోనే మెగాఫోన్ పట్టుకున్నారు. ఇపుడు తమిళంలో టాప్ డైరెక్టర్‌గా సత్తా చూపుతున్నాడు. (File/Photo)
ఎస్.ఏ.చంద్రశేఖర్ | ఎస్.ఏ.చంద్రశేఖర్: తమిళ స్టార్ హీరో విజయ్ తండ్రి అయిన ఎస్.ఏ.చంద్రశేఖర్.. తమిళంలో పెద్ద డైరెక్టర్. ఈయన తెలుగులో చిరంజీవితో ‘చట్టానికి కళ్లులేవు’, దేవాంతకుడు’తో పాటు శోభన్ బాబుతో ‘బలిదానం’ వంటి చిత్రాలను తెరకెక్కించారు. శంకర్, మురుగదాస్ వంటి వాళ్లు ఈయన శిష్యులే. (Twitter/Photo)
బొమ్మరిల్లు భాస్కర్ | స్వతహాగా తమిళవాడైన బొమ్మరిల్లు భాస్కర్ తెలుగ సినిమా ‘బొమ్మరిల్లు’తో దర్శకుడిగా సత్తా చాటారు. ఆ తర్వాత పరుగు, ఆరెంజ్,ఒంగోలు గిత్త వంటి చిత్రాలతో మెప్పించలేకపోయారు. రీసెంట్గా అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిరల్’ మూవీతో దర్శకుడిగా సత్తా చాటారు. ఇక ఈయన తమిళంలో ‘బెంగళూరు నాటకల్’ సినిమాను తెరకెక్కించారు. (Twitter/Photo)
బి.ఆర్.పంతులు: తమిళంలో ఎంజీఆర్, శివాజీ గణేషన్‌లతో ఎన్నో బ్లాక్ బస్టర్స్‌ను తెరకెక్కించిన బి.ఆర్.పంతులు. మన తెలుగు వాళ్లకు కే.వి.రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు ఎలాగో.. తమిళ తొలి తరం అగ్ర దర్శకుల్లో ఈయనకు ప్రత్యేక స్థానం ఉంది. ఈయన తెలుగులో కర్ణ, వీరకట్ట బ్రహ్మన్న వంటి డబ్బింగ్ సినిమాలతో ఇక్కడ కూడా సత్తా చాటారు. ఆ తర్వాత ఈయన తెలుగులో పలు స్ట్రెయిట్ సినిమాలను కూడా తెరకెక్కించారు. (Twitter/Photo)