ఆ పనులతో చేతినిండా డబ్బుతో విలాసవంతంగా జీవితాలను గడపటం తమకు అలవాటైపోయిందని..కానీ ఇప్పుడు అలాంటివేం లేకపోవడంతో డబ్బులకు చాలా ఇబ్బంది పడుతున్నామని.. అందుకే ముంబై వచ్చామని చెప్పారు వాళ్లు. అంతేకాకుండా ఎందరో హీరోయిన్స్, మోడల్స్ ముంబై వచ్చి డబ్బులు సంపాదించుకుని వెళ్లారని.. తాము కూడా అలాగే ఇక్కడికి వచ్చామని వాళ్లు చెప్పడం గమనార్హం.
వీళ్ళను అరెస్ట్ చేసి పునరావాస కేంద్రాలకు తరలించారు పోలీసులు. డబ్బుల కోసం చూస్తున్న అమ్మాయిల అవసరాన్ని ఆసరగా చేసుకుని కొందరు ఈ ఉచ్చులోకి దించుతున్నారంటున్నారు పోలీసులు. ఇలాంటి వాళ్ళ బలహీనతలను వాడుకుని బిజినెస్ చేస్తున్న దళారులను, వేశ్యాగృహాల యజమానులైన ఇద్దరు మహిళలను కూడా అరెస్ట్ చేశారు ముంబై పోలీసులు.