పాపులర్ తమిళ సినీ హీరో విజయ్ ఈ రోజు ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి శ్రీ కె. చంద్రశేఖర్ రావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా విజయ్ ని సీఎం శాలువాతో సన్మానించారు. విజయ్‌తో పాటు దర్శకుడు వంశీ పైడిపల్లి కూడా సీఎం కేసీఆర్‌ను కలిసారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పిక్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. విజయ్ బీస్ట్ తర్వాత దిల్ రాజు నిర్మాణంలో వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతోన్న ఈ సినిమా వచ్చే సంక్రాంతికి విడుదలకానుంది. రష్మిక మందన్న హీరోయిన్గా చేస్తున్నారు. Photo : Twitter
'సన్ పిక్చర్స్' బ్యానర్ పై కళానిధిమారన్ ఈ చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో దిల్ రాజు రిలీజ్ చేశారు. ఈ సినిమాను దిల్ రాజ్ భారీ ధర పెట్టి కొన్నారు. అయితే సినిమా సరిగా ఆకట్టుకోకపోవడంతో నష్టాలు వచ్చాయి. బీస్ట్‌కు తొలిరోజు నుంచి నెగిటివ్ టాక్ రావడంతో రెండో రోజు నుండీ బుకింగ్స్ దారుణంగా పడిపోయాయి. మరోవైపు దీనికి పోటీగా 'కె.జి.యఫ్ 2' ఉండడం 'బీస్ట్' చేతులెత్తేసింది. తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రం థియేట్రికల్ రన్ ముగిసింది. దీంతో ఈ సినిమా క్లోజింగ్ కలెక్షన్స్ చూద్దాం.. Photo : Twitter
బీస్ట్ నైజాం 2.45 కోట్లు, సీడెడ్‌లో 1.10 కోట్లు, ఉత్తరాంధ్ర 0.90 కోట్లు, ఈస్ట్ 0.63 కోట్లు, వెస్ట్ 0.62 కోట్లు, గుంటూరు 0.80 కోట్లు, కృష్ణా 0.52 కోట్లు, నెల్లూరు 0.40 కోట్లు వసూలు అయ్యాయి. మొత్తంగా ఏపీ, తెలంగాణలో చూస్తే.. బీస్ట్‌కు 7.42 కోట్లు వసూలు అయ్యాయి. అయితే 'బీస్ట్' చిత్రానికి తెలుగు రాష్ట్రాల్లో రూ.10.68 కోట్ల థియేట్రికల్ బిజినెస్ జరిగింది. దీంతో ఈ మూవీ బ్రేక్ ఈవెన్ అవ్వాలి అంటే రూ.11 కోట్ల షేర్‌ను రాబట్టాల్సింది. కాగా ఫుల్ రన్ ముగిసేసరికి ఈ బీస్ట్ తెలుగు రాష్ట్రాల్లో రూ.7.42 కోట్ల షేర్ ను మాత్రమే రాబట్టింది. దీంతో బీస్ట్ ఇక్కడి నిర్మాతలకు దాదాపుగా రూ.3.26 కోట్ల నష్టాలను మిగిల్చిందని అంటున్నారు. Photo : Twitter
తాజాగా ‘బీస్ట్’ మూవీకి సంబంధించిన ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్ అయింది. ఈ సినిమాను మే 11 నుంచి నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. అది కూడా తెలుగు, తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషలకు సంబంధించి ఒకే రోజు స్ట్రీమింగ్ కానుంది. మరోవైపు ఈ సినిమా సన్ నెక్ట్స్‌లో కూడా స్ట్రీమింగ్ అవనుంది. (Twitter/Photo)
ఇక యాక్షన్-థ్రిల్లర్‌గా వచ్చిన బీస్ట్ విషయానికి వస్తే.. దీనికి నెల్సన్ దిలీప్ కుమార్ దర్శకత్వం వహించారు. సన్ పిక్చర్స్ భారీగా నిర్మించింది. పూజాహెగ్డే హీరోయిన్గా చేశారు. ఇక అది అలా ఉంటే ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బీస్ట్ అనుకున్నంతగా లేదని సోషల్ మీడియాలో టాక్ నడుస్తోంది. దర్శకుడు అభిమానులకు డిస్సాప్పాంట్ చేశారని కామెంట్స్ చేస్తున్నారు. చెన్నైలో కొందరు అభిమానులు ఏకంగా సినిమా బాగాలేదని థియేటర్ పరదాను తగలబెట్టారు. Photo : Twitter