దే ఇంట్లో తమన్నా- దీపిక పదుకొనే ఇద్దరి మధ్యా వాడి వేడిగా ఏం చర్చ సాగిందో కానీ... చూస్తుంటే ప్రాజెక్ట్ కేలో నటిస్తున్న దీపికకు ప్రభాస్ కి సంబంధించిన విషయాలు చెబుతున్నట్టే కనిపిస్తోంది. ప్రభాస్ నటించిన బాహుబలి - రెబల్ లాంటి చిత్రాల్లో తమన్నా కథానాయిక. అందుకే దీపిక ఇప్పుడిలా మిల్కీతో మాటా మంతీ కలిపిందని కూడా అభిమానులు అంచనా వేస్తున్నారు.
దీపికా పదుకొనె ప్రస్తుతం ప్రభాస్ సరసన ..ప్రాజెక్ట్ కేలో నటిస్తోన్న విషయం తెలిసిందే. ఈమె ఇప్పటికే షూటింగ్ లో పాల్గొని తన భాగం షూట్ కూడా స్టార్ట్ చేసింది.అలాగే ఈ సినిమాలో మరొక హీరోయిన్ బాలీవుడ్ యంగ్ బ్యూటీ దిశా పటానీ కూడా నటిస్తుంది. ఈ సినిమాను వైజయంతి మూవీస్ పతాకంపై నిర్మిస్తున్నారు.2024 అక్టోబర్ లోనో లేదంటే 2025 సంక్రాంతి కానుక గానో రిలీజ్ చేయడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.