సర్కారు వారి పాట తర్వాత మహేష్ బాబు మరో సినిమాలో బిజీ అయ్యాడు. మహేష్ .. మాటల మాంత్రికుడుతో కలిసి ఓ సినిమా చేస్తున్నాడు. వీరిద్దరి కాంబోలో ముచ్చటగా మూడో సినిమా రెడీ అవుతోంది. పాన్ ఇండియా ఇమేజ్ ను దృష్టిలో పెట్టుకుని, ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాలో ఇద్దరు హీరోయిన్లు ఫిక్స్ అయ్యారు.
అతడు, ఖలేజా తర్వాత మహేష్ బాబు, త్రివిక్రమ్ కాంబినేషన్లో ఓ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే కదా. జూలై నుంచి రెగ్యులర్ షూటింగ్ మొదలు కానున్న ఈ సినిమాలో మహేష్ బాబు రెండు విభిన్న పాత్రల్లో కనిపించనున్నట్టు సమాచారం. ఈ సినిమాను త్రివిక్రమ్ పీరియాడిక్ డ్రామా నేపథ్యంలో తెరకెక్కించబోతున్నట్టు ప్రచారం జరుగుతోంది. (Twitter/Photo)
ఇక మహేష్ తాాజా సినిమా విషయానికి వస్తే.. ఈ చిత్రాన్ని ఫ్లాష్ బ్యాక్‌తో పాటు ప్రస్తుతం జరిగే సీన్స్‌ను వెరైటీ స్క్రీన్ ప్లే తో త్రివిక్రమ్ ఈ సినిమాను తెరకెక్కించబోతున్నట్టు సమాచారం. ఇందులో ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చే మహేష్ బాబు సన్నివేశాలే ఈ సినిమాకు హైలెట్ కానున్నాయట. గత కొన్నేళ్లుగా వీళ్లిద్దరు కలిసి సినిమా చేస్తే చూడాలని చాలా కాలంగా అభిమానులు వేచి చూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే నటిస్తోంది. మరో కథానాయికగా శ్రీలీల నటించబోతున్నట్టు సమాచారం. (Twitter/Photo)