దీంతో ఇప్పుడు తమన్నా పెళ్లిపై మరో క్రేజీ న్యూస్ బయటకొచ్చింది. ముంబైకి చెందిన బడా బిజినెస్ మెన్‌తో తమన్నా పెళ్లికి రెడీ అయిందని అంటున్నారు. గత కొన్నేళ్లుగా ఉన్న పరిచయంతో ఆయన్ను పెళ్లి చేసుకునేందుకు తమ్మూ అంగీకారం చెప్పిందని టాక్. ఈ పెళ్లి విషయమై త్వరలోనే అధికారిక ప్రకటన కూడా రానుందని తెలుస్తోంది.
ఇలా తమన్నా పెళ్లి మ్యాటర్స్ తెరపైకి రావడం కొత్తేమీ కాదు. గతంలో ఓ క్రికెటర్ తో తమన్నా లవ్ ట్రాక్ నడుస్తోందని, త్వరలోనే ఈ ఇద్దరూ పెళ్లి కూడా చేసుకోనున్నారనే వార్తల ప్రవాహం నడించింది. ఆ తర్వాత మరో వ్యక్తి పేరు తెరపైకి వచ్చింది. అయితే అవన్నీ రూమర్స్ అని తమన్నా కొట్టిపారేయడంతో ఇప్పుడు బడా బిజినెస్ మెన్‌తో తమన్నా పెళ్లి అనే సీక్రెట్ రివీల్ అయింది.
తన మిల్కీ అందాలతో వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తున్న తమన్నాకు భారీ ఫాలోయింగ్ ఉంది. శ్రీ (Sree) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ (Happy Days) సినిమాతో కెరీర్లో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.