అంతేకాదు ఇంకో అడుగు ముందుకేసి తమన్నా పెళ్లి చేసుకోబోయే వాడికి వింత వ్యాధి కూడా ఉందనే ప్రచారాలు నడిచాయి. వింత వ్యాధితో సదరు అబ్బాయి బాధపడుతున్నప్పటికీ.. ఆస్తి కోసం తమన్నా అతడితో పెళ్లికి సిద్ధమైందంటూ ప్రచారం నడిచింది. దీంతో వీటన్నింటికీ సమాధానం చెబుతూ రూమర్లు పుట్టించిన వారికి కౌంటర్ ఇచ్చింది తమన్నా.
తన మిల్కీ అందాలతో వెండితెరపై గ్లామర్ ట్రీట్ ఇస్తూ వస్తున్న తమన్నాకు భారీ ఫాలోయింగ్ ఉంది. శ్రీ (Sree) సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ ముద్దుగుమ్మ హ్యాపీ డేస్ (Happy Days) సినిమాతో కెరీర్లో టర్న్ తీసుకుంది. ఆ తర్వాత వరుసపెట్టి స్టార్ హీరోల సినిమాల్లో నటించి పలు బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకుంది.