డిసెంబర్ 21న టాలీవుడ్ ఎవర్ గ్రీన్ క్యూట్ హీరోయిన్ తమన్నా భాటియా పుట్టిన రోజు . ఇండస్ట్రీకి వచ్చి 16 ఏళ్లైనా ఇప్పటికీ చిన్న పిల్లలా కనిపిస్తుంది తమన్నా. అది కేవలం ఆమెకు మాత్రమే సాధ్యం. ఈ రేంజ్ పోటీలో కూడా ఇప్పటికీ అవకాశాలు అందుకుంటూనే ఉంది ఈ భాటియా బేబీ. అప్పుడెప్పుడో 2005లోనే తెలుగు ఆడియన్స్‌కు హలో చెప్పింది తమన్నా. అప్పట్నుంచి సినిమాలు చేస్తూనే ఉంది. ఇప్పటి వరకు దాదాపు 50 సినిమాల వరకు నటించింది కూడా.
బాలకృష్ణ, గోపీచంద్ మలినేని కాంబినేషన్లో తెరకెక్కే సినిమాలో తమన్నా ఐటెం సాంగ్ చేయడానికి మిల్కీ బ్యూటీ ఓకే చెప్పినట్టు సమాచారం. అంతేకాదు ఈ ఐటెం సాంగ్ చేయడానికి తమన్నాకు దాదాపు రూ. 50 లక్షల రూపాయల పారితోషకం కూడా ఇస్తున్నారట. అంతేకాదు ఆ తర్వాత బాలయ్య సినిమాలో ఈమె కథానాయికగా తీసుకోబోతున్నట్టు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. (Twitter/Photo)
ఈ యేడాది తమన్నా నటించిన సీటీమార్ విషయానికి వస్తే.. అనేక అవాంతరాల నడుమ ఈ సినిమా సెప్టెంబర్ 10న వినాయక చవితి కానుకగా ప్రపంచవ్యాప్తంగా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకోవడమే కాదు. కలెక్షన్స్ కూడా బాగానే రాబట్టింది. ఇక బాలకృష్ణ కూడా ‘అఖండ’ మూవీతో భారీ బ్లాక్ బస్టర్ అందుకున్నారు. అంతేకాదు ఈ మూవీ బాలయ్య కెరీర్లో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచింది. (Twitter/Photo)
ఇక హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది. భోళా శంకర్ తమిళ వేదాళంకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా చేస్తోంది. గతంలో ఈమె ‘సైరా నరసింహారెడ్డి’ మూవీలో నటించింది. ఇక వెంకటేష్ సరసన ఎఫ్ 2లో నటించింది. మరోవైపు ఎఫ్ 3లో కూడా మరోసారి వెంకీ సరసన నటిస్తోంది. ఇక నాగార్జున సరసన కూడా త్వరలో నటించబోతుంది. గతంలో ఈమె నాగార్జున హీరోగా నటించిన ‘ఊపిరి’లో నటించినా.. కథానాయికగా మాత్రం యాక్ట్ చేయలేదు.(Twitter/Photo)
తమన్నా ఐటెం సాంగ్ చేయడం ఇదే మొదటి సారి కాదు. గతంలో పలు చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో మెరిసింది.తొలిసారి ‘కో’ మూవీలో ఐటైం సాంగ్ చేసింది. ’రెడీ’ ఆ తర్వాత అనుష్క ‘సైజ్ జీరో’,, నిన్న నేడు రేపు, అల్లుడు శీను, స్పీడున్నోడు, జాగ్వార్, జై లవకుశ, కెజియఫ్, సరిలేరు నీకెవ్వరు సినిమాల్లో ఐటెం సాంగ్స్‌లో నటించింది. మరోవైపు వరుణ్ తేజ్.. ‘గని’లో కూడా ఈమె ప్రత్యేక గీతంలో నటించబోతుంది. తాజాగా బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలో మాత్రం అదిరిపోయే ఐటెం సాంగ్ చేయడానికి ఓకే చెప్పింది. ఈ విషయమై అధికారిక ప్రకటన వెలుబడాల్సి ఉంది. (File/Photo)