తమన్నా తెలుగులో తాజాగా నటించిన సినిమా గుర్తుందా శీతాకాలం. ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వచ్చిన ఈ చిత్రంలో సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదలై ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
తాజాగా ఈశా యోగా ప్రాంగణానికి వెళ్లిన తమన్నా అక్కడ లింగ భైరవిని దర్శించుకుంది. లింగ భైరవిని దర్శించుకొంది. అక్కడ లింగ భైరవి దేవిని దర్శించుకున్న వీడియోను పోస్ట్ చేస్తూ.. 'ఈ యోగాశ్రమం నుంచి ఆహ్వానం రావడం సంతోషంగా ఉంది . లింగ భైరవి దేవిని దర్శించుకోవడం మానసిక ఉల్లాసాన్ని కలిగిస్తోందని తమన్నా పేర్కొంది.
తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. తమన్న అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు.
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer). ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. Photo : Twitter