తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. Photo : Instagram
తమన్నా సినిమాల విషయానికి వస్తే.. ఇప్పటికి వరుసగా సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కేక పెట్టిస్తున్నారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాళ్లు తగ్గిందని అనిపిస్తే స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నాను సంప్రదించేవారున్నారు. అలాంటిది ఆమె హీరోయిన్గా చేస్తోన్న ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ కోసం వేరే భామను దింపితే తమన్నా ఫీల్ అయ్యారట. Photo : Instagram
. తమన్నా 'ఎఫ్ 2' లో అందాల విందు చేస్తూ.. కేక పెట్టించిప సంగతి తెలిసిందే. అయితే 'ఎఫ్ 3' లోను తనదే పై చేయిగా ఉంటుందని తమన్నా భావించి ఉంటారు.. కానీ హఠాత్తుగా మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ను రంగంలోకి దింపారు దర్శక నిర్మాతలు. ఇక ఆ తర్వాత స్పెషల్ సాంగ్ కోసం పూజ హెగ్డేను తీసుకుని వచ్చారు. Photo : Instagram