తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 15 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఇండస్ట్రీకి వచ్చిన ఇన్నేళ్లలో తమన్నా ఆస్తి ఎన్ని కోట్లు సంపాదించి ఉంటుందో అని చర్చించుకుంటున్నారు ఆమె అభిమానులు.
ఇక ఆమె ఆస్తుల విషయానికి వస్తే.. తమన్నా ముంబైలో ఒక అద్భుతమైన ఇల్లు నిర్మించుకుందని తెలుస్తోంది. దీని ధర సుమారు రూ 10 కోట్ల పైనే ఉంటుందట. అంతేకాకుండా పలు వ్యాపారాలలో కూడా తమన్నా డబ్బు ఇన్వెస్ట్మెంట్ చేసినట్లుగా సమాచారం. ప్రస్తుతం ఒక్కో సినిమాకి రూ.3 కోట్ల రూపాయలు అందుకుంటోన్న తమన్నా ఆస్తి విలువ దాదాపు గా రూ.100 కోట్లకుపైగా ఉన్నట్లు సమాచారం. ఇక ఈమెకు 3 ఖరీదైన కార్లు ఉన్నాయి. వాటి విలువ రూ.8 కోట్లు ఉంటుందని తెలుస్తోంది.
ఇక తమన్నా గురించి తమన్నా గ్లామర్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఇప్పటికి వరుసగా సినిమాల్లో అవకాశాలు అందిపుచ్చుకుంటూ కేక పెట్టిస్తున్నారు. తెలుగు సినిమాల్లో గ్లామర్ పాళ్లు తగ్గిందని అనిపిస్తే స్పెషల్ సాంగ్ కోసం ముందుగా తమన్నాను సంప్రదించేవారున్నారు. అలాంటిది ఆమె హీరోయిన్గా చేస్తోన్న ఎఫ్ 3లో స్పెషల్ సాంగ్ కోసం వేరే భామను దింపితే తమన్నా ఫీల్ అయ్యారట. అందుకే ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి తమన్నా రాలేదని అంటున్నారు. అంతేకాదు మరోవైపు తమన్నా.. ఇంతవరకూ కూడా ఒక్క ఇంటర్వ్యూలోను కనిపించలేదు. దీంతో ప్రమోషన్స్ కూడా రాకపోవడంతో అదే నిజం అని అంటున్నారునెటిజన్స్. Photo : Instagram
ఇక్కడ మరో విషయం ఏమంటే.. తమన్నా 'ఎఫ్ 2' లో అందాల విందు చేస్తూ.. కేక పెట్టించిప సంగతి తెలిసిందే. అయితే 'ఎఫ్ 3' లోను తనదే పై చేయిగా ఉంటుందని తమన్నా భావించి ఉంటారు.. కానీ హఠాత్తుగా మరో హీరోయిన్ సోనాల్ చౌహాన్ ను రంగంలోకి దింపారు దర్శక నిర్మాతలు. ఇక ఆ తర్వాత స్పెషల్ సాంగ్ కోసం పూజ హెగ్డేను తీసుకుని వచ్చారు. ఇలా ఈ సినిమాలో తన పాత్రను తగ్గించారనే అలకతోనే తమన్నా ఎఫ్ 3 ప్రమోషన్స్ కి రావడం లేదని సోషల్ మీడియాలో ప్రచారం సాగుతోంది. Photo : Instagram
అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో(Venkatesh) వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందుతోంది. Photo : Instagram
వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట్రిక్ కోసం ఎఫ్ 3 సినిమా చేస్తున్నారు అనిల్ రావిపూడి. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా మే 27న విడుదలైంది. . ఇక చిరంజీవి హీరోగా మెహెర్ రమేష్ దర్శకత్వంలో భోళా శంకర్ (Chiranjeevi bhola shankar) అనే సినిమాను చేస్తున్నారు. ఈ సినిమా తాజాగా లాంఛనంగా ప్రారంభమైంది. భోళా శంకర్ తమిళ వేదాళంకు రీమేక్‌గా వస్తోంది. ఈ సినిమాలో తమన్నా హీరోయిన్గా చేస్తోంది. Photo : Instagram