తమన్న అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా గుర్తుందా శీతాకాలం సినిమాతో ఆమె ప్రేక్షకుల్ని పలకరించింది.
గత కొన్ని రోజులుగా తమన్నా పెళ్లి వార్తలు వైరల్ అయ్యాయి. మిల్కీ బ్యూటీ ఓ బిజినెస్ మ్యాన్‌ను పెళ్లి చేసుకుంటుందని వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే ఈ రూమర్స్ పై స్పందించిన తమన్నా తనకు ఇంకా ఎలాంటి పెళ్లి ఫిక్స్ కాలేదని క్లారిటీ ఇచ్చేసింది. అయితే తమన్నా ఈ సారి మరో ఇంట్రస్టింగ్ న్యూస్‌తో వార్తల్లోకి ఎక్కింది.
తమన్న ఓ నటుడితో క్లోజ్ గా ఉన్న వీడియోలు, ఫోటోలు ఇప్పుడు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. దీంతో తమన్నా అతడితో డేటింగ్ చేస్తుందన్న వార్త గుప్పుమనింది. తమన్నా లేటెస్ట్ వీడియోలు, ఫోటోలు చూసినవారంతా అవును ఇది నిజమే అని అంటున్నారు. తమన్నా డేటింగ్ చేస్తున్న వ్యక్తి అని ఆరా తీసి అతడ్ని వెతికి పట్టేసుకున్నారు.
న్యూఇయర్ సందర్భంగా సెలబ్రిటీలంతా ఫుల్ పార్టీ మూడ్ లోకి వెళ్లిపోయారు. ఇక తమన్నా న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ను ఎవరూ ఊహించని వ్యక్తితో జరుపుకుంది. ఆ వ్యక్తితో పార్టీ మూడ్‌లో చాలా క్లోజ్‌గా ఛిల్ అవుతున్న విజువల్స్ ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. దీంతో మిల్కీ బ్యూటీ అతడితో డేటింగ్లో ఉందని జనం చర్చిం చుకోవడం మొదలుపెట్టారు.
తమన్నా 2005లో 15 సంవత్సరాల వయస్సులో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో నటించింది. ఇక అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మొదటి విజయాన్ని అందించింది. ఇక 2011లో 100% లవ్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ , ఎందుకంటే... ప్రేమంట! , రెబల్ , కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో అదరగొట్టింది. Photo : Instagram