మీల్కీ బ్యూటీ తమన్నా, యువ హీరో సత్యదేవ్ కలిసి నటించిన లేటెస్ట్ సినిమా “గుర్తుందా శీతాకాలం”. నాగశేఖర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో మేఘా ఆకాష్ మరో కీలక పాత్రలో నటించింది. మంచి అంచనాలతో 2022 డిసెంబరు 9న విడుదలైన ఈ సినిమా అనుకున్న రేంజ్లో ఆకట్టుకోలేకపోయింది. అది అలా ఉంటే ఈ సినిమా సడెన్‌గా ప్రముఖ ఓటీటీ యాప్ అమెజాన్‌లో ఎంట్రీ ఇచ్చింది. ఈ సినిమా ఈరోజు స్ట్రీమింగ్ అవుతోంది. చూడాలి మరి అక్కడ ఎలా ఆకట్టుకోనుందో.. Photo : Twitter
ఇక తమన్నా నటిస్తున్న మరో సినిమా జైలర్. ప్రస్తుతం రజనీకాంత్ హీరోగా వస్తున్న జైలర్‌లో హీరోయిన్గా నటిస్తోంది తమన్నా. సన్ పిశ్చర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు నెల్సన్ దర్శకుడు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ సినిమాలో మోహన్ లాల్ మరో ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. తెలుగు నటుడు సునీల్ కూడా ఓ కీలకపాత్రలో నటిస్తున్నారు. ఎప్రిల్ 14న ఈ సినిమా తమిళ్‌తో పాటు తెలుగులో కూడా విడుదలకానుంది. Photo : Twitter
ఇక తమన్నా సినీ కెరీర్ విషయానికి వస్తే.. తమన్న అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 17 ఏళ్లైపోయింది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతున్నారు తమన్నా. తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని అందుకున్నారు. అది అలా ఉంటే ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్... Photo : Twitter
తమన్నా ప్రధాన పాత్రలో రూపొందిన లేటెస్ట్ కామెడీ డ్రామా 'బబ్లీ బౌన్సర్' (Babli Bouncer). ఈ సినిమాకు మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా థియేటర్స్‌లో కాకుండా.. డైరెక్ట్‌గా ప్రముఖ ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చింది. హాట్ స్టార్‌లో తెలుగుతో పాటు హిందీ, తమిళ భాషాల్లో స్ట్రీమింగ్ అవుతోంది. మంచి అంచనాల నడుమ వచ్చిన ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. Photo : Twitter
అది అలా ఉంటే హీరోయిన్ తమన్నా పెళ్లిపై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోన్న సంగతి తెలిసిందే. వస్తూనే ఉన్నాయి. ఇప్పటికే ఇలాంటీవి చాలా వచ్చాయి. ఇక తాజాగా మరోకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తమన్నా త్వరలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయ్యిందని టాక్. అందులో భాగంగా ప్రస్తుతం సినిమాలను కూడా తగ్గించేసిందని అంటున్నారు. కొన్ని రోజుల క్రితమే తమన్నా పెళ్లికి ఓకే చెప్పిందట. Photo : Instagram
ఈ క్రమంలో తాజాగా ముంబైకి చెందిన ఓ వ్యాపారవేత్త తో తమన్నా పెళ్లి ఫిక్స్ అయిందని రూమర్స్ వినిపిస్తున్నాయి. ఆమె పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని అంటున్నారు. ఇక మరోవైపు తాజాగా తమన్నా ఓ ఫోటోను పంచుకున్నారు. మెహందీ పెట్టుకున్నానంటూ ఓ ఫోటోను పంచుకున్నారు. దీంతో కొంపదీసి తమన్నా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. చూడాలి మరి ఈ వార్తల్లో నిజం ఎంతో.. Photo : Instagram
ఇక తమన్నా నటించిన లేటెస్ట్ సినిమా ఎఫ్ 3 విషయానికి వస్తే.. అనిల్ రావిపూడి దర్శకత్వంలో దిల్ రాజు నిర్మాణంలో(Venkatesh) వెంకటేష్, వరుణ్ తేజ్ (Varun Tej) హీరోలుగా నటించిన ’ఎఫ్ 2’మూవీ ఎంత పెద్ద హిట్టైయిందో తెలిసిందే కదా. ఈ సినిమా 2019 సంక్రాంతికి విడుదలై ఘన విజయం సాధించింది. చాలా యేళ్ల తర్వాత వెంకటేష్‌లోని కామెడీ యాంగిల్ బయటికి తీసుకొచ్చిన సినిమా ఎఫ్ 2. ఇక ఆ సినిమాకు ఎఫ్ 3 అంటూ సీక్వెల్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ సినిమా కూడా మంచి ఆదరణ పొందింది. Photo : Instagram
తమన్నా 2005లో 15 సంవత్సరాల వయస్సులో హిందీలో చాంద్ సా రోషన్ చెహ్రాలో నటించింది. ఇక అదే సంవత్సరం ఆమె శ్రీ చిత్రంతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆమెకు శేఖర్ కమ్ముల దర్శకత్వంలో వచ్చిన హ్యాపీ డేస్ మొదటి విజయాన్ని అందించింది. ఇక 2011లో 100% లవ్‌తో మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఆ తర్వాత వరుసగా రచ్చ , ఎందుకంటే... ప్రేమంట! , రెబల్ , కెమెరామెన్ గంగతో రాంబాబు వంటి సినిమాలతో అదరగొట్టింది. Photo : Instagram
ఇక ఆమె కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ - రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట. వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఈ వజ్రాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల బహుమతిగా ఇచ్చారని అంటున్నారు. Photo : Twitter
క 2020లో లాక్ డౌన్ సమయంలో సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది తమన్నా. దాదాపు 17 ఏళ్ల కింద ఈమె తొలిసారి స్క్రీన్‌పై కనిపించింది. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాల్లోకి వచ్చేసింది. శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అప్పట్లో మంచు మనోజ్‌తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే నటించింది తమన్నా. దానికంటే ముందుగానే ఓ కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా.పగలు 10 ఎగ్జామ్స్ రాసి.. మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు మూడు రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా. Photo : Instagram