దాదాపు 18యేళ్లుగా సినీ ఇండస్ట్రీని హీరోయిన్గా ఏలడం అంటే మాములు విషయం కాదు. తమన్నా తన మిల్కీ అందాలతో తెలుగు సహా అన్ని ఇండస్ట్రీస్‌లో సత్తా చూపెడుతోంది. ఇప్పటికే వన్నె తగ్గని అందంతో మత్తెక్కిస్తోంది. తాజాగా ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో మెరిసింది. ఈ చిత్రంలో తమన్నా, సత్యదేవ్ ముఖ్యపాత్రలు పోషించారు. ఈ నెల 9న ఈ చిత్రం విడుదల కానుంది. (Instagram/Photo/Tamannaah)
తమన్నా తెలుగులో తాజాగా నటించిన సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. ఈ సినిమాను కన్నడ నటుడు నాగశేఖర్ దర్శకత్వం వహించారు. రొమాంటిక్ ఎంటర్టైనర్గా వస్తోన్న ఈ చిత్రంలో సత్యదేవ్, తమన్నా, కావ్యాశెట్టి, మేఘా ఆకాశ్, ప్రియదర్శి ప్రధాన పాత్రల్లో నటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం డిసెంబర్ 9న విడుదలవుతోంది. దీంతో టీమ్ ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ప్రీరిలీజ్ ఈవెంట్’ను హైదరాబాద్‌లో నిర్వహించింది. ఈ కార్యక్రమానికి అడివి శేష్ గెస్ట్‌గా వచ్చారు. (Twitter/Photo)
తమన్నా అందం గురించి, నటన గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. చూస్తుండగానే తమన్నా ఇండస్ట్రీకి వచ్చి 18 ఏళ్లైపోయింది. త్వరలో 20 యేళ్ల కెరీర్ పూర్తి చేసుకోబోతుంది. ఇన్నేళ్లలో 50కి పైగా సినిమాల్లో నటించింది తమన్నా. తెలుగుతో పాటు తమిళ, హిందీ, కన్నడ సినిమాల్లోనూ నటిస్తూ తన సత్తాను చాటుతోంది తమన్నా. ఇన్నేళ్లలో తమన్నా అంటే ముందుగా గుర్తొచ్చేది మిల్కీ అందాలే.Tamannaah Bhatia :. Photo : Instagram
ఇక ఆమె కార్ల కలెక్షన్స్ విషయానికి వస్తే.. ఆమెకు ల్యాండ్ రోవర్ రేంజ్ రోవర్ డిస్కవరీ స్పోర్ట్ రూ.75.59 లక్షలు కాగా బీఎండబ్ల్యూ 320 ఐ - రూ.43.50 లక్షలు.. మెర్సిడేస్ బెంజ్ జి ఎల్ ఈ రూ.1.02 కోట్లు.. మిత్సు బిషి పేజర్ స్పోర్ట్స్ కార్ రూ.29.96 లక్షలు ఉన్నాయట. వీటితో పాటు తమన్నా దగ్గర ప్రపంచంలోనే ఐదవ అతిపెద్ద వజ్రం కూడా ఉందని తెలుస్తోంది. ఇక దీని విలువ రెండు కోట్ల రూపాయలకు పైగా ఉంటుందని అంటున్నారు. ఈ వజ్రాన్ని రామ్ చరణ్ సతీమణి ఉపాసన కొణిదెల బహుమతిగా ఇచ్చారని అంటున్నారు. (Instagram/Photo)
తాజాగా ఈమె మధుర్ బండార్కర్ దర్శకత్వంలో తెరకెక్కిన ‘బబ్లీ బౌన్సర్’ సినిమాతో పలకరించింది. ఈ సినిమా డిస్నీ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. ఆ తర్వాత ప్లాన్ A ప్లాన్ B సినిమాతో పలకరించింది. ఈ సినిమా నెట్‌ప్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. దాంతో పాటు సత్యదేవ్‌తో నటించిన ‘గుర్తుందా శీతాకాలం’ సినిమా ఈ నెల 9న విడుదల కానుంది. (Instagram/Photo)
ఈ సినిమాలో చిరంజీవితో పాటు మరో కీలకపాత్రలో కీర్తి సురేష్ (Keerthy Suresh) నటిస్తున్నారు. కాగా ఈ సినిమాలో హీరోయిన్గా తమన్నా చేస్తుంది. తమన్నా గతంలో ఒకసారి చిరంజీవి సరసన నటించిన సంగతి తెలిసిందే. సురేందర్ రెడ్డి దర్శకత్వంలో వచ్చిన సైరా చిత్రంలో తమన్నా (Tamannaah) తన నటనతో అదరగొట్టిన సంగతి తెలిసిందే. దీంతో ఆమెకి ఇది రెండో సినిమా అని చెప్పాలి Photo : Instagram
దీంతో పాటు తమన్నా యువ హీరో సత్యదేవ్‌తో కలిసి 'గుర్తుందా శీతాకాలం' సినిమాలో నటిస్తోంది. కన్నడ హిట్ మూవీ 'లవ్ మాక్‌టైల్'కు రీమేక్‌గా ఈ చిత్రం తెరకెక్కుతోంది. 2020లో లాక్ డౌన్ సమయంలో సినిమాలు కాకుండా వెబ్ సిరీస్ వైపు అడుగులు వేసింది తమన్నా. పదో తరగతి చదువుతున్న రోజుల్లోనే తమన్నా సినిమాల్లోకి వచ్చేసింది.Photo : Instagram
శ్రీ సినిమాతో తెలుగు తెరకు పరిచయం అయింది. అప్పట్లో మంచు మనోజ్‌తో కలిసి కేవలం 15 ఏళ్ల వయసులోనే నటించింది తమన్నా. దానికంటే ముందుగానే ఓ కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా.పగలు 10 ఎగ్జామ్స్ రాసి.. మధ్యాహ్నం కనీసం పార్లర్ కూడా వెళ్లకుండా 2 నుంచి 10 గంటల వరకు మూడు రోజుల పాటు కమర్షియల్ యాడ్ చేసింది తమన్నా.
మరో రెండేళ్లవరకు పెళ్లి ఆలోచన లేదని క్లియర్ గా చెప్పేసింది. నిజానికి ఆమెకి అవకాశాలు తగ్గిన సమయంలో పెళ్లి చేసుకోవాలనుకుంది. ఇంట్లో సంబంధాలు కూడా చూశారు. కానీ ఇప్పుడు ఆమె కెరీర్ ఊహించని విధంగా టర్న్ తీసుకుంది. ఒక్కో సినిమాకి రూ.1.5 నుంచి రూ. 2 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటుంది. కానీ అనూహ్యంగా ఈమె పెళ్లి చేసుకోవడానికి ఒప్పుకున్నట్టు ఆమె సన్నిహితులు చెబుతున్నారు.
అయితే తమన్నా ఎవరితో డేటింగ్ చేస్తున్నట్లు ఇప్పటివరకు ఒక్క న్యూస్ కూడా వినిపించలేదు. కానీ విరాట్ కోహ్లితో అప్పట్లో ఈమె చెట్టా పట్టాలెేసుకొని తిరిగింది. వాళ్ల ఫ్యామిలీకి ఓ బిజినెస్ మ్యాన్‌తో ఈ ఇయర్ ఎండ్‌లో పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అయిందట. అంతేకాదు త్వరలో తనకు కాబోయే వాడు ఎవడనే విషయాన్ని కూడా వెల్లడించే అవకాశం ఉందని చెబుతున్నారు. పెళ్లి తర్వాత కాజల్, సమంత తరహాలో సినిమాలు కంటిన్యూ చేయాలనే ఆలోచనలో ఉంది. తమన్నా. అందుకు కాబోయే వాడు కూడా ఓకే చెప్పినట్టు సమాచారం. అందుకే తమన్నా.. పెళ్లి పీఠలు ఎక్కడానికి రెడీ అయినట్టు సమాచారం. మొత్తంగా తమన్నా పెళ్లి విషయంలో క్లారిటీతో ఉన్నట్టు అర్ధమవుతోంది. (Twitter/Photo)