హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

టబు వాళ్లకి హ్యాండిచ్చినట్టేనా...

టబు వాళ్లకి హ్యాండిచ్చినట్టేనా...

సినిమాల్లోని కీలక పాత్రలకు వెటరన్ హీరోయిన్లను ఎంపిక చేసుకోవడానికి దర్శకులు చాలా ఆసక్తి చూపిస్తున్నారు. ఈ క్రమంలోనే అల వైకుంఠపురములో సినిమాలో ఓ కీలకమైన పాత్ర కోసం టబును తీసుకున్నాడు దర్శకుడు త్రివిక్రమ్. ఆమె పాత్రకు సినిమాలో చాలా ప్రయారిటీ ఉంటుందనే ప్రచారం కూడా కూడా జరిగింది. అయితే ఈ నయా మూవీ ప్రమోషన్స్‌కు మాత్రం టబు దూరంగా ఉండటం చర్చనీయాంశంగా మారింది. ఓ వైపు ఈ సినిమాకు పోటీగా వస్తున్న సరిలేరు నీకెవ్వరూలో కీలక పాత్ర పోషించిన విజయశాంతి... సినిమా ప్రమోషన్స్‌లోనూ పాల్గొంటోంది. కానీ టబు మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా వ్యవహరించడం టాలీవుడ్‌లో టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

Top Stories