హోమ్ » ఛాయాచిత్రాల ప్రదర్శన » సినిమా »

పది సంవత్సరాల తర్వాత డబ్బింగ్ చెప్తోన్న సీనియర్ హీరోయిన్..

పది సంవత్సరాల తర్వాత డబ్బింగ్ చెప్తోన్న సీనియర్ హీరోయిన్..

Tabu : టబు.. వెంకటేశ్ హీరోగా వచ్చిన ‘కూలీ నెం.1’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత నాగార్జునతో ‘నిన్నే పెళ్లాడుతా’ సినిమాతో తెలుగు వారికి దగ్గరైంది. తెలుగు కంటే హిందీలో చాలా సినిమాలు చేసింది టబు. అయితే చాలా రోజుల తర్వాత తెలుగులో టబు చేసిన సినిమా 'పాండురంగడు'. ఆ తర్వాత 10 సంవత్సరాలకు త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హీరోగా వస్తున్న సినిమాలో ఓ కీలక పాత్రలో నటిస్తోంది. శరవేగంగా చిత్రీకరణ జరుపుకొంటున్న ఈ సినిమా సంక్రాంతి కానుకగా జనవరి 11న విడుదల కానుంది. ఇందులో టబు కీలక పాత్ర పోషిస్తున్నారు. తాజాగా టబు తన పాత్రకు డబ్బింగ్‌ చెప్పటం ప్రారంభించారని సమాచారం. దీని కోసం ఆమె ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఇన్నేళ్ల తర్వాత టబు తెలుగులో రీ ఎంట్రీ ఇస్తుండటంతో అందరిలో ఆసక్తి పెరిగింది.

Top Stories