Prema Desham: ఈ మధ్యకాలంలో పాత సూపర్ హిట్ సినిమాలను రీ రిలీజ్ చేయడమనే ట్రెండ్ మళ్లీ మొదలైంది. పోకిరితో మొదలైన ఈ ట్రెండ్.. ఆ తర్వాత జల్సా, ఘరానా మొగుడు, చెన్నకేశవరెడ్డి వరకు కొనసాగుతూనే ఉంది. తాజాగా ఈ లిస్టులో అలనాటి సూపర్ హిట్ మూవీ ‘ప్రేమ దేశం’ మూవీ కూడా చేరింది. టబు, అబ్బాస్, వినీత్ ముఖ్యపాత్రల్లో కదిర్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం కూడా థియేటర్స్లో ప్రేక్షకులను పలకరించనుంది. (Twitter/Photo)
1996లో ఈ సినిమాను ‘కాదల్ దేశం’ పేరుతో విడుదల చేస్తే అక్కడ బంపర్ హిట్ అందుకుంది. అటు తెలుగులో ప్రేమ దేశం పేరుతో సెన్సేషనే క్రియేట్ చేసింది. హిందీలో కూడా మంచి సక్సెస్ అందుకుంది. అప్పట్లోనే ప్యాన్ ఇండియా లెవల్లో సూపర్ హిట్టైన ఈ చిత్రం రీ రిలీజ్లో ఎలాంటి సంచనాలు నమోదు చేస్తుందో చూడాలి. (Twitter/Photo)