తాప్సీ తెలుగు ప్రేక్షకులకు పెద్దగా పరిచయాలు అక్కర్లేదు. మంచు మనోజ్ హీరోగా కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఝుమ్మంది నాదం’ సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే పాత్ర డిమాండ్ చేస్తే అందాల ఆరబోతకు ఏమాత్రం వెనకాడనని తాప్సీ చెప్పకనే చెప్పేసింది. హిట్లు, ప్లాపులతో సంబంధం లేకుండా తాప్సీకి వరుస సినిమా ఆఫర్లు క్యూ కడుతున్నాయి. ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన ఈ భామ బాలీవుడ్లో లేడీ ఓరియంటెడ్ మూవీస్తో అలరిస్తోంది. (Twitter/Photo)
చాలా రోజుల నుంచి ఈమె ప్రేమలో ఉందనే విషయం తెలుసు. కాకపోతే ఎవరు అనేది మాత్రం చెప్పలేదు తాప్సీ. తను ప్రేమలో ఉన్నాను.. కానీ ఇండస్ట్రీ మనిషి కాదని మాత్రం ఇదివరకే చెప్పుకొచ్చింది ఈమె. ఈయనెవరో ఇప్పుడు బయటపెట్టింది తాప్సీ. ఆ మధ్య తన ప్రియుడితో కలిసి మాల్దీవులకు కూడా వెళ్లింది. అక్కడ ఎంజాయ్ చేస్తుంది. ఇన్నాళ్ళకు తన ప్రియుడి గురించి చెప్పింది తాప్సీ. (Instagram/Photo)
తన పర్సనల్ లైఫ్లో భాగమైన ప్రియుడు మథియాస్ విషయంలో అదే చేశానని చెప్పుకొచ్చింది తాప్సీ. ప్రేమలో ఉన్నాను కానీ పెళ్లి గురించి ఆలోచించడం లేదని చెప్పుకొచ్చింది తాప్సీ. ఒకేసారి అరడజన్ సినిమాలు చేయడం కంటే కూడా మూడు సినిమాలు ఒప్పుకుంటే అటు ప్రొఫెషనల్.. ఇటు పర్సనల్ లైఫ్ హాయిగా ఉంటుందని.. రెండింటికీ టైమ్ కేటాయించవచ్చని చెప్పుకొచ్చింది తాప్సీ. తాను ఇప్పుడు అదే చేస్తున్నట్లు చెప్పింది తాప్సీ. (Twitter/Photo)