తెలుగు సినీ ఇండస్ట్రీకి సంబంధించినంత వరకు సంక్రాంతి అతిపెద్ద సీజన్. అందుకే ఈ ఫెస్టివల్ రోజున తమ సినిమాలను విడుదల చేయాలని బడా హీరో నుంచి అప్ కమింగ్ హీరోల వరకు అందరు ఉవ్విళూరుతారు. ఇక చిరంజీవి కూడా తన కెరీర్లో ఎన్నో సినిమాలు సంక్రాంతి కానుకగా విడుదలై మంచి విజయాలే సాధించాయి. మొత్తంగా సంక్రాంతి సీజన్లో విడుదలై సంచలన విజయాలు సాధించిన సినిమాల విషయానికొస్తే.. (Twitter/Photo)
3.ప్రేమ పిచ్చోళ్లు | 14 జనవరి 1983న చిరంజీవి, కోదండరామిరెడ్డి కాంబినేషన్లో తెరకెక్కిన ‘ప్రేమ పిచ్చోళ్లు’ సినిమా.. హిందీలో బసు ఛటర్జీ దర్శకత్వంలో వచ్చిన ‘షౌకీన్స్’ సినిమాకు రీమేక్. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. సోలో హీరోగా చిరంజీవికి తొలి సినిమా. ఈ మూవీ బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్‌గా నిలిచింది. (File/Photo)
11.ముగ్గురు మొనగాళ్లు - 9 జనవరి 1994న విడుదలైన ఈ సినిమాలో చిరంజీవి తొలిసారి త్రిపాత్రాభినయం చేసారు. రాఘవేంద్రరావు, చిరంజీవి కలయికలో వచ్చిన పన్నెండో చిత్రం ‘ముగ్గురు మొనగాళ్లు’. . మెగాస్టార్ చిరంజీవి.కే.రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర ఫ్లాప్‌గా నిలిచింది. ఈ చిత్రంలో చిరంజీవి సరసన రోజా, నగ్మా, రమ్యకృష్ణ హీరోయిన్స్‌గా నటించారు. సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా ఫెయిల్ అయింది. (File/Photo)
18. వాల్తేరు వీరయ్య | 13 జనవరి 2023న మెగాస్టార్ చిరంజీవి 18వ సారి సంక్రాంతి బాక్సాఫీస్ బరిలో దిగుతున్నారు. ఇప్పటి వరకు పొంగల్ సీజన్లో విడుదలైన చిరంజీవి చిత్రాల్లో సగం సక్సెస్ అందుకుంటే.. సగం ఫ్లాప్ అయ్యాయి. ఇపుడు విడుదల కాబోతున్న ‘వాల్తేరు వీరయ్య’ సినిమాతో మెగాస్టార్ చిరంజీవి హిట్ అందుకొని బాక్సాఫీస్ దగ్గర సంక్రాంతి హీరో అనిపించుకుంటాడా లేదా అనేది చూడాలి. (Twitter/Photo)