Happy Birthday Swathi Reddy : కలర్స్ స్వాతి.. ఈ పేరుకు తెలుగులో ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఎందుకంటే 15 ఏళ్లకే యాంకర్ అయి.. ఆ తర్వాత సైడ్ ఆర్టిస్టుగా మారి.. హీరోయిన్గా ఎదిగింది స్వాతి. తెలుగులోనే కాకుండా తమిళ మలయాళీ ఇండస్ట్రీలో కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఇక 2018లో మలయాళీ పైలెట్ వికాస్ వాసును పెళ్లి చేసుకుని సినిమాలకు బ్రేక్ ఇచ్చింది. Photo : Facebook
ఇక ఇప్పుడు నిఖిల్ కార్తికేయ సినిమాకు సీక్వెల్ వస్తోంది. ఈ సినిమాలో కూడా స్వాతి నటిస్తుందని తెలుస్తోంది. ఈ సినిమాతో పాటు మరో రెండు సినిమాల్లో ఈ భామ అవకాశాలు దక్కించుకుందని తెలుస్తోంది. ఇక ఇప్పటికే స్వాతి 'పంచతంత్రం' అనే సినిమాతో తన సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెట్టింది. నూతన దర్శకుడు హర్ష పులిపాక ఈ సినిమా తెరకెక్కిస్తున్నారు. Photo : Facebook