మెగాస్టార్ కెరీర్ లో చార్ట్ బస్టర్ అయిన ఓ సాంగ్ ని ఈ సినిమా కోసం రీ క్రియేట్ చేస్తున్నట్లుగా తెలుస్తోంది. చూడాలని ఉంది సినిమాలో రామ్మా చిలకమ్మ సాంగ్ ని రీమిక్స్ చేసి మెగా అభిమానులకు కిక్కిచ్చే ప్లాన్ చేశారట మేకర్స్. ఈ సాంగ్ కి అప్పుడు మణిశర్మ వర్క్ చేయగా ఇప్పుడు ఇదే పాట రీమిక్స్ కోసం తన కొడుకు మహతి సాగర్ బాణీలు కడుతున్నట్లు టాక్.
ఈ సినిమాలో చిరంజీవి సరసన తమన్నా (Tamannah) హీరోయిన్గా నటిస్తుండగా.. చిరు చెల్లెలి పాత్రలో కీర్తి సురేశ్ (Keerthi Suresh) కనిపించనుంది. ఈ మూవీపై మెగా ఫ్యాన్స్ భారీ అంచనాలు పెట్టుకున్నారు. త్వరత్వరగా షూటింగ్ పనులు పూర్తి చేసి ఈ సినిమాను మే 12న విడుదల చేయాలని దర్శక నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు.