Sushant Singh Rajput - Puneeth Rajkumar - Rishi Kapoor celebs death: మనం ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినపుడు చాలా బాధ పడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతుంటారు అభిమానులు. అందులో చనిపోయిన తర్వాత పునీత్ రాజ్ కుమార్ సినిమా జేమ్స్ విడుదలైంది. అటు రిషీ కపూర్, సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ సినిమాలు ఓటీటీ వేదికగా విడుదలయ్యాయి. మొత్తంగా సినీ నటులు చనిపోయిన తర్వాత విడుదలై వారి చివరి సినిమాలపై ఫోకస్.. (File/Photo)
మనం ఎంతగానో ప్రేమించే నటులు చనిపోయినపుడు చాలా బాధ పడుతుంటారు. మన ఇంట్లో మనిషి పోయినంత ఫీల్ అవుతుంటారు అభిమానులు. 2021లో కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ గుండె పోటుతో అకాల మరణం చెందారు. దీంతో అభిమానులు తమ కుటుంబ సభ్యులను కోల్పోయినంత బాధ పడ్డారు. అంతకు ముందు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ చనిపోతే కొందరు అభిమానులు దాన్ని తట్టుకోలేక ఆత్మహత్య కూడా చేసుకున్నారు. ఇక మరో కన్నడ వర్ధమాన హీరో చిరంజీవి సర్జ చనిపోయినపుడు కూడా ఎంతోమంది కుమిలిపోయారు.
గతేడాది కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్‌కుమార్ చనిపోతే చాలా మంది అభిమానుల గుండెలు ఆగిపోయాయి. ఆయన మరణం తట్టుకోలేక సెలబ్రిటీస్ కూడా కన్నీరు పెట్టుకున్నారు. ఈయన నటించిన చివరి సినిమా ‘జేమ్స్’ సినిమా గతేడాది మార్చి 17 విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమా కోసం పునీత్ అన్న శివరాజ్‌కుమార్ డబ్బింగ్ చెప్పడం విశేషం. పునీత్ కంటే ముందు అలా కొందరు చనిపోయిన తర్వాత వాళ్ళ చివరి సినిమాలు విడుదలయ్యాయి. అవేంటో ఒక్కసారి చూద్దాం..(Twitter/Photo)
రిషీ కపూర్ | మూడేళ్ల క్రితం క్యాన్సర్‌తో చనిపోయారు. ఈయన అప్పటికే ‘శర్మజీ నమ్కీన్’ అనే సినిమా చేసారు. ఈ సినిమా గతేడాది మార్చి 31న అమెజాన్ ప్రైమ్‌లో విడుదల చేసారు. రిషీ కపూర్ చనిపోయిన దాదాపు రెండేళ్ల తర్వాత ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమాలో మిగిలిన కొంత భాగాన్ని పరేష్ రావల్ పూర్తి చేయడం విశేషం. (Twitter/Photo)
చిరంజీవి సర్జ: కన్నడలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న సమయంలో కేవలం 35 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించాడు చిరంజీవి సర్జ. ఈయన చనిపోయిన తర్వాత ‘రణం’ సినిమా సగం షూటింగ్ కంప్లీటైంది. మరో సినిమా ‘రాజా మార్తాండ’ కూడా సగం కంప్లీటయ్యాయి. వీటి విడుదల మాత్రం అనుమానామే. ఈయన ప్రముఖ హీరో యాక్షన్ కింగ్ అర్జున్‌కు మేనల్లుడు.
దివ్య భారతి: చాలా తక్కువ సమయంలో.. అందులోనూ కేవలం 19 ఏళ్ల వయసులోనే ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది దివ్య భారతి. ఈమె 1993లో చనిపోయింది. అప్పటికే ఈమె కొన్ని సినిమాలు సైన్ చేసింది. దివ్య భారతి మరణానంతరం హిందీలో రంగ్, శత్రంజ్.. తెలుగులో ‘తొలి ముద్దు’ సినిమాలు విడుదలయ్యాయి.అందులో కొన్ని సీన్స్‌ను రంభతో షూట్ చేశారు.
శ్రీహరి: కెరీర్ పీక్స్‌లో ఉన్నపుడే హఠాన్మరణం చెందాడు రియల్ స్టార్ శ్రీహరి. హిందీ సినిమా ‘రాంబో రాజ్‌కుమార్’ షూటింగ్ కోసం ముంబై వెళ్లిన ఈయన అక్కడే లీలావతి హాస్పిటల్లో చనిపోయాడు. 2013 అక్టోబర్ 9న శ్రీహరి చనిపోతే.. ఆయన మరణానంతరం రాంబో రాజ్‌కుమార్ విడుదలైంది. తెలుగులో కూడా చాలా సినిమాలు ఆయన చనిపోయిన తర్వాత వేరే వాళ్ల డబ్బింగులతో విడుదలయ్యాయి.
శంకర్ నాగ్: కన్నడలో ఒకప్పుడు సూపర్ స్టార్ ఈయన. ఈ తరానికి తెలిసినా తెలియకపోయినా 80ల్లో శంకర్ నాగ్ అంటే సంచలనం. యాక్షన్ హీరోగా చక్రం తిప్పిన ఈయన 1990లో ఓ కార్ ప్రమాదంలో చనిపోయాడు. కేవలం 35 ఏళ్ల వయసులోనే శంకర్ నాగ్ కన్నుమూసాడు. అప్పటికే ఈయన చేతిలో చాలా సినిమాలున్నాయి. శంకర్ నాగ్ చనిపోయిన మూడేళ్ల వరకు కూడా ఆయన సినిమాలు విడుదల అవుతూనే ఉన్నాయి.