Sushant Singh Rajputh - Puneeth Rajkumar : సినీ ఇండస్ట్రీలో స్టార్ స్టేటస్ అందుకున్న సెలబ్రిటీలు కొంత మంది హఠాత్తుగా కన్నుమూయం అభిమానులు జీర్ణించుకోలేని విషయం అనే చెప్పాలి. అందులో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్.. సినీ ఇండస్ట్రీలోని నెపోటిజం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నారు. ఈయన వయసు 34 యేల్లు. కన్నడ స్టార్ హీరో పునీత్ రాజ్‌కుమార్ కూడా 46 యేళ్ల వయసులో హఠాత్తుగా గుండుపోటుతో మరణించడం కన్నడతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. వీళ్లిద్దరి కంటే ముందు ఇంకా చాలా మంది చిన్న వయసులోనే ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. (File/Photo)
Puneeth Rajkumar | Puri Jagannadh : కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ హఠాన్మరణాన్ని ఆయన అభిమానులతో పాటు, సినీ సెలెబ్రిటీస్ ఇప్పటికీ జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ రాజ్ కుమార్ 46 ఏళ్ల వయసులోనే గుండెపోటుతో మరణించడంతో తట్టుకోలేకపోయారు. ఎంతో భవిష్యత్తు ఉన్న నటుడు అకాల మరణం కన్నడ చిత్ర పరిశ్రమతో పాటు భారతీయ చిత్ర పరిశ్రమ ఒక్కసారిగా ఉలిక్కి పడింది.
చిరంజీవి సర్జ: : పునీత్ రాజ్ కుమార్ కంటే ముందు 2020లో గుండెపోటుతో మరణించిన హీరో చిరంజీవి సర్జ. కన్నడలో స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న సమయంలో కేవలం 35 ఏళ్ళ వయసులోనే గుండెపోటుతో మరణించారు చిరంజీవి సర్జ. ఈయన దక్షిణాది యాక్షన్ కింగ్ అర్జున్ మేనల్లుడు. ఈయన చనిపోయేనాటికి ఈయన చేతిలో అర డజను పైగా సినిమాలు ఉండే. (Twitter/Photo)
వేణు మాధవ్ | వేణు మాధవ్ మరణం తెలుగు సినిమా పరిశ్రమకు తీరనిలోటే. ఈయన ఒకప్పుడు సంచలన సినిమాలతో దూసుకుపోయాడు. ఏడాదికి కనీసం 30 సినిమాలకు పైగా చేసిన రోజులు కూడా ఉన్నాయి. చిన్న వయసులోనే కన్నుమూయడం విషాదం. ఈయన వయసు 49 ఏళ్లు మాత్రమే. 1969లో జన్మించిన వేణు మాధవ్.. 4వ ఏట నుంచే మిమిక్రీ చేయడం మొదలు పెట్టారు. సినిమాల్లోనూ తనదైన శైలిలో నవ్వించారు.
బ్రూస్లీ | ప్రపంచ యాక్షన్ ప్రియులకు అతి ఇష్టమైన హీరో బ్రూస్లీ. ఈయన 1973 జూలై 20న ‘గేమ్ ఆఫ్ డెత్’ సినిమా షూటింగ్లో ఈయన అస్వస్తతకు గురై 32 యేళ్లకే కన్నుమూసారు. ఈయన హీరోగా, దర్శకుడిగా, నిర్మాతగా కూడా రాణించారు. ఈయన కూడా అతిగా వర్కౌట్స్ చేయడం కారణంగా చనిపోయారని కొంత మంది. ఈయనపై విష ప్రయోగం చేసారనే ఆరోపణలున్నాయి. ఏమైనా ఈయన మరణం ఇప్పటికీ మిస్టరీనే అని చెప్పాలి. (File/Photo)