Surrogacy movie celebrities: ఆడదాని జీవితం అమ్మతోనే పరిపూర్ణం అవుతుందని చాలా మంది చెప్తుంటారు. అమ్మతనంలోని కమ్మదనం అలాంటిది మరి. అమ్మ అవడం అనేది ఓ వరం. అలాంటిది పిల్లలు పుట్టకపోవడం కంటే శాపం మరోటి ఉండదు. కానీ పిల్లలు పుట్టకపోతే ఇప్పుడు పుట్టేలా చేసే మెడికల్ టెక్నాలజీ కూడా వచ్చింది.ఈ టెక్నాలజీని కొంత మంది సెలబ్రిటీస్ అడాప్ట్ చేసుకున్నారు. గతేడాది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇదే చేసింది. ఈమె కూడా సరోగసితో కవల పిల్లలకు జన్మనిచ్చింది. (File/Photo)
1.నయనతార | ముఖ్యంగా అద్ధె గర్భం అందులో బెస్ట్ ఆప్షన్. ఈ పద్దతిలోనే చాలా మంది టెస్ట్ ట్యూబ్ బేబీస్ పొందుతున్నారు. ఆరోగ్య కారణాలు లేదంటే వాళ్ల వ్యక్తిగత నిర్ణయాల కారణంగా కొందరు సరోగసితో పిల్లల్ని కన్నారు. గతేడాది సౌత్ లేడీ సూపర్ స్టార్ నయనతార ఇదే చేసింది. ఈమె కూడా సరోగసితో కవల పిల్లలకు జన్మనిచ్చింది. గతేడాది 9 జూన్ నయనతార, విఘ్నేష్ శివన్‌ల పెళ్లి జరిగింది. మ్యారేజ్ అయిన నాలుగు నెలల్లోనే వీళ్లిద్దరు పండంటి కవలకు జన్మనిచ్చారు. ప్రస్తుతం పిల్లలతో నయనతార దంపతులు ఎంజాయ్ చేస్తున్నారు. ఇక సినీ ఇండస్ట్రీలో నయనతార టూ మన మంచు లక్ష్మి నుంచి బాలీవుడ్ షారుక్ ఖాన్ వరకు అలాంటి సరోగసి పిల్లలను ఒక్కసారి చూద్దాం.. (File/Photo)
1. ప్రియాంక చోప్రా - నిక్ జోనాస్: బాలీవుడ్ హాట్ బ్యూటీ ప్రియాంక చోప్రా మూడేళ్ల కింద హాలీవుడ్ పాప్ సింగర్ నిక్ జోనాస్‌ను పెళ్లి చేసుకుంది. తనకంటే పదేళ్లు చిన్నవాడైన నిక్‌ను పెళ్లాడిన ప్రియాంక.. ఇప్పుడు సరోగసి పద్దతిలో మొదటి బిడ్డను కన్నారు. ఇదే విషయాన్ని ప్రపంచానికి చెప్పారు ఈ జంట. చాలా గోప్యంగా ఈ విషయాన్ని చివరి వరకు ఉంచారు.