Nirupam Paritala - Manjula Paritala: బుల్లితెరలో కార్తీకదీపం సీరియల్ తో బుల్లితెర స్టార్ హీరోగా మారిన డాక్టర్ బాబు అలియాస్ నిరుపమ్ పరిటాల గురించి అందరికీ పరిచయమే. ఎన్నో సీరియల్స్ లో నటించగా.. ఈ సీరియల్ తోనే మంచి క్రేజ్ సంపాదించుకున్నాడు. ఈయన మరో బుల్లితెర నటి మంజులను పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఇక సోషల్ మీడియాలో కూడా బాగా యాక్టివ్ గా ఉంటాడు నిరుపమ్. ఇటీవలే యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసుకున్నాడు. తాజాగా అందులో ఓ వీడియో పంచుకున్నాడు. తన భార్య ఎప్పటి నుండో కారు కావాలని కోరడంతో.. తన బర్త్ డే సందర్భంగా తన భార్యకు కారును బహుమతిగా ఇచ్చి సర్ ప్రైజ్ చేశానని తెలిపాడు