ఒక భాషలో హిట్టైయిన చిత్రాన్ని వేరే భాషలో రీమేక్ చేయడం అనేది ఎప్పటి నుంచో ఉంది. ఇప్పటి వరకు ఓటీటీ వేదికగా విడుదలైన ఏ సినిమాలు కూడా పూర్తి స్థాయి పాజటివ్ టాక్ రాలేదు. కానీ సూర్య నటించిన ‘సూరారై పొట్రు’ చిత్రం హిట్ కాదు ఏకంగా బ్లాక్ బస్టర్ అనిపించుకుంది. ఈ పినిమా తెలుగులో ‘ఆకాశం నీ హద్దురా’ పేరుతో విడుదలై ఇక్కడ కూడా సూపర్ హిట్ అనిపించుకుంది. తాజాగా అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో ఈ సినిమాను రీమేక్ చేస్తున్నారు.
గత కొన్ని రోజులుగా ఈ సినిమాను బాలీవుడ్లో రీమేక్ చేస్తున్నట్టు వార్తలు వచ్చాయి. తాజాగా ఈ సినిమాను హిందీలో అక్షయ్ కుమార్ హీరోగా అఫీషియల్‌గా రీమేక్ చేస్తున్నట్టు ప్రకటించారు. ఈ చిత్రంతో సూర్య హిందీలో నిర్మాతగా అడుగుపెట్టనున్నారు. గతంలో ‘రక్త చరిత్ర -2’తో బాలీవుడ్లో నటుడిగా అడుగుపెట్టిన సూర్య.. ఇపుడు నిర్మాతగా తన సత్తా చూపించాలనుకుంటున్నారు. తాజాాగా అక్షయ్ కుమార్ లుక్ విడుదల చేశారు. హిందీలో టైటిల్‌ను మాత్రం ప్రకటించలేదు. (Twitter/Photo)
ఈ సినిమాను దక్కన్ ఎయిర్ వేస్ అధినేత ఆర్.గోపీనాథ్ గురించి రాసిన ‘సింప్లి ఫ్లై’ పుస్తకం ఆధారంగా తెరకెక్కించారు. దీనికి సుధ కొంగర కొన్ని సినిమాటిక్ మార్పులు చేర్పులు చేసారు. మొత్తంగా తెలుగు, తమిళ ప్రేక్షకులతో భళా అనిపించిన ‘ఆకాశం నీ హద్దురా’ సినిమా బాలీవుడ్ ప్రేక్షకులను ఏ మేరకు అలరిస్తుందో చూడాలి. (Twitter/Photo)