క ఆ తర్వాత ఆయన తన సినిమాలతో తెలుగువారిని అలరిస్తూనే ఉన్నారు. ఇటీవల సూర్య నటించిన మరో చిత్రం జై భీమ్ (Jai Bhim). సూర్య 40వ సినిమాగా రూపొందిన ఈ చిత్రంలో సూర్య లాయర్ పాత్రలో నటించారు. జై భీమ్’ సినిమా అడివి బిడ్డలకు జరిగిన అన్యాయాన్ని కళ్లకు కట్టినట్లు చూపించింది. ఇందులో సూర్య అడవి బిడ్దల తరుపున న్యాయ పోరాటం చేసే వకీల్ సాబ్ పాత్రలో కనిపించి అదరగొట్టారు. Photo : Twitter
ఇక జైభీమ్ తర్వాత సూర్య నటిస్తున్న మరో సినిమా ఈటి Etharkkum Thunindhavan (ఎతర్క్కుమ్ తునిందవన్). ఈ సినిమాను మార్చి 10న విడుదల చేయనున్నారు. దీంతో ప్రచారంలో భాగంగా ఇప్పటికే తెలుగు టీజర్‌ను విడుదల చేసింది టీమ్. ఇక తాజాగా ట్రైలర్‌ను విడుదల చేశారు. పక్కా మాస్ అండ్ యాక్షన్ అంశాలతో ఈ చిత్రాన్ని దర్శకుడు పాండి రాజ్ తెరకెక్కించినట్టు తెలుస్తోంది. Photo : Twitter
మాంచి మాస్ ఎలిమెంట్స్‌లో ఈ ట్రైలర్‌ను కట్ చేశారు. సూర్యకు ఈ సినిమా రూపంలో మరో మాస్ హిట్ దొరికేలా ఉంది. ఈ ట్రైలర్ లో మరో హైలైట్ డి ఇమ్మాన్ ఇచ్చిన బ్యాగ్ గ్రౌండ్ స్కోర్. ఈ తెలుగు ట్రైలర్‌ను విజయ్ దేవరకొండ సోషల్ మీడియా వేదికగా రిలీజ్ చేశారు. మార్చ్ 10న పాన్ ఇండియా లెవెల్లో రిలీజ్ కాబోతున్న ఈ చిత్రం ఎలా ఉంటుందో చూడాలి. ఈ సినిమాలో వినయ్‌రామ్, సత్యరాజ్, జయప్రకాశ్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. Photo : Twitter
ఈ సినిమా ఒకేసారి తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళీ భాషల్లో కూడా విడుదల కానుంది. సన్ పిక్చర్స్ నిర్మిస్తోన్న ఈ సినిమాకి సంబంధించి తెలుగు వెర్షన్ కి సూర్య స్వయంగా తన డబ్బింగ్ ని తానే చెప్పుకుంటున్నారు. ఇక సూర్య గతంలో “బ్రదర్స్” అనే సినిమాకు డబ్బింగ్ చెప్పుకున్నారు. మళ్ళీ ఇన్నాళ్ళకి ఈ చిత్రానికి ఆయన స్వయంగా డబ్బింగ్ చెబుతున్నారు. Photo : Twitter